ఫన్నీ వీడియో: కూతురికి మనీ ఇవ్వడానికి ఒప్పేసుకున్న తల్లి.. కొడుకు అడిగితే మాత్రం..?

సాధారణంగా కూతుర్లను తల్లిదండ్రులు ( parents )చాలా గారాభంగా పెంచుతారు.కొడుకులను మాత్రమే స్ట్రిక్ట్ గా పెంచుతారు.

 Funny Video Mother Who Agreed To Give Money To Her Daughter, But If Her Son Asks-TeluguStop.com

అమ్మాయిలు ఏం అడిగినా వెంటనే కొనిస్తారు కానీ అబ్బాయిలకు ఏమీ కొనివ్వరు.ఇది నిజం అని నిరూపించే ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ “మంకిట్స్_లిటిల్_వరల్డ్ (@mankits_little_world)”లో పోస్ట్ చేసిన ఈ ఫన్నీ వీడియో చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.ఈ వీడియోలో ఒక అమ్మాయి తన అమ్మ దగ్గరకు వచ్చే బుంగమూతి పెట్టుకుంటుంది.

పాకెట్ మనీ విషయంలో గొడవ పడుతుంది.తర్వాత ఆమె పాకెట్ మనీ విషయంలో తల్లిని ఒప్పిస్తుంది.

అది విని వాళ్ళ అన్నయ్య ఆమెలాగనే తల్లితో గొడవ పెట్టుకుంటాడు.కానీ అతనికి ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది.

ఈ వీడియో ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి తన అమ్మతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని చెప్తుంది.అమ్మ ఆశ్చర్యపోయి, ఎందుకు అని అడుగుతుంది.అమ్మాయి, “నాకు చాలా తక్కువ పాకెట్ మనీ ఇస్తున్నావు, నన్ను ఓ చిన్నపిల్లగా చూస్తున్నావు” అని చెప్తుంది.తన నాన్న కాలేజీ దగ్గర రోజూ దింపడం చూసి తనని ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారని కూడా అంటుంది.

అప్పుడు అమ్మ తన కూతురితో కూల్ గా, “సరే, నీ పాకెట్ మనీ పెంచుతాను.మిగతా విషయాలు ఆలోచిస్తాను” అని చెప్పింది.

దీంతో కూతురు చాలా సంతోషించి, గది నుంచి వెళ్లిపోయింది.గెలిచినట్లుగా ఫీల్ అవుతుంది.

కానీ ఇక్కడే విషయం ఫన్నీగా మారుతుంది! వాళ్ళ అన్న బయట నుంచి ఈ సంభాషణంతా విని గదిలోకి వచ్చి, “నేను ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను!” అని ధైర్యంగా చెప్పాడు.పాకెట్ మనీ పెంచుతుందేమో అని అనుకున్నాడు కానీ ఆ అమ్మ వెంటనే, “సరే, వెళ్లిపో” అని చెప్పింది.దాంతో అతడికి పెద్ద షాక్ తగిలింది.ఇంట్లో నుంచి వెళ్ళిపో అనగానే బిక్క మొహం వేశాడు.అమ్మాయి గెలిచిందని ఆనందంగా ఉన్నా, అన్నయ్యకు మాత్రం బాధే మిగిలింది.అమ్మాయి ఇచ్చిన రిప్లై, అన్నయ్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఈ వీడియో చూశాక ఇంట్లో కూతుర్లదే పై చేయి అని అర్థమవుతుంది.అంతేకాదు, ఇది చాలా ఫన్నీగా కూడా ఉంది.కుటుంబంలో ఎలాంటి చర్చలు జరుగుతాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube