తాజాగా హెజ్‌బొల్లాను నిర్మూలించే లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్‌లో భీకర దాడులు చేస్తున్న సంగతి అందరికీ విధితమే.ఈ దాడులలో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా( Hassan Nasrallah ) మృతి చెందినట్లుగా సంగతి ఇజ్రాయిల్ అధికారులు ప్రకటించారు.
ప్రస్తుతం ఆయన మరణ వార్త ఆ ప్రాంతంలో సంచలనం సృష్టిస్తుంది.తమ నాయకుడు మృతి చెందడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
ఈ తరుణంలో ఒక ప్రముఖ వార్తా చానల్లో అతడి మరణ వార్త చదువుతో ప్రముఖ యాంకర్ తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
మరోవైపు ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ… లెబనాన్ ప్రజలు హెజ్‌బొల్లాకు అండగా ఉండాలని దాడులు ఎదుర్కోవడంలో వారికి సహాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి రిక్వెస్ట్ చేశాడు.ఏడాది కాలంగా గజాలో జరుగుతున్న యుద్ధంలో నుంచి వారు ఏమీ నేర్చుకోలేదు అలాగే పిల్లలు, మహిళలు, పౌరులు, సామూహిక హత్యలు ఇవి ఏమీ కూడా ప్రతిఘటన శక్తుల్ని విచ్ఛిన్నం చేయలేవని వారికి ఇంకా ఈ విషయం అర్థం అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు.అలాగే నస్రల్లా హత్య అనంతరం అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్లోని ఒక సురక్షిత ప్రాంతానికే తరలించినట్లు తెలుస్తుంది.అలాగే ఇస్రాయిల్( Israel ) దాడికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతూ టెహ్రాన్‌లో వేలాది మంది ఇరానియన్లు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు.
ఇక మరోవైపు తమ నాయకుడికి మృతి చెందాడని హజ్‌బొల్లా కూడా ధృవీకరించబడింది.అయితే, ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.ఈ దాడులలో ఆయన కుమార్తె కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి అంటూ సమాచారం.అంతేకాకుండా పాలస్తీనాకు మద్దతివ్వడంతో పాటు శత్రుదేశంపై తమ యుద్ధం కొనసాగిస్తామని హజ్‌బొల్లా తెలియజేసింది.
ఇక చివరికి ఈ యుద్ధం ఎటు దారితీస్తుందో చూడాలి మరి.అలాగే ఈ యాంకర్ బాధపడుతున్న వీడియో చూసి కొంతమంది కన్నీరు మున్నీరు అవుతున్నారు.అలాగే వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.