రాఘవ లారెన్స్( Raghava Lawrence ) హీరోగా రమేష్ వర్మ ( Ramesh Verma )దర్శకత్వంలో వస్తున్న ‘బుల్లెట్ బండి’ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా నుంచి ఈరోజు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
మరి ఇందులో రాఘవ లారెన్స్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇంతకుముందు రాఘవ లారెన్స్ చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్న విషయ మనకు తెలిసిందే.
ఇప్పటికే ఆయన రాక్షసుడు, కిలాడీ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.ఇప్పుడు ఈ సినిమాతో కనక సక్సెస్ ని సాధిస్తే రమేష్ వర్మ టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక రాఘవ లారెన్స్ హార్రర్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు.తన చేంజ్ ఓవర్ కోసం ఇప్పుడు డిఫరెంట్ పాత్రలను కూడా పోషిస్తూ వస్తున్నాడు.అందులో భాగంగానే ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ఒక సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న రాఘవ లారెన్స్ ఇతరుల దర్శకత్వంలో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇక ఇప్పటికే లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

ఇతరుల దర్శకత్వంలో చేసిన కొన్ని సినిమాలు కూడా విజయాలను సాధిస్తూ ఉండడం విశేషం.ఇక ఏది ఏమైనా కూడా లారెన్స్ కొరియోగ్రాఫర్ గానే కాకుండా దర్శకుడిగా, నటుడిగా పలు వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసిన చాలామంది సినిమా ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…
.







