గూగుల్ కంపెనీకి తాజాగా ఒక కోర్టు భారీ షాక్ ఇచ్చింది.ఇంగ్లాండ్‌కు చెందిన షివాన్, ఆడమ్ రాఫ్ అనే దంపతులు తమ “ఫౌండమ్” వెబ్‌సైట్‌ను గూగుల్( Google ) అన్యాయంగా అణిచివేసిందని కోర్టును ఆశ్రయించారు.
గూగుల్ తన సొంత సర్వీసులను మాత్రమే ప్రోత్సహిస్తూ, ఇతర కంపెనీల వెబ్‌సైట్లను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.ఈ కేసు చాలా కాలంగా కోర్టులో నడిచింది.
చివరకు, గూగుల్ తప్పు చేసిందని తేలింది.దీంతో, గూగుల్ కంపెనీ భారీగా జరిమానా చెల్లించాలని యూరోపియన్ కోర్టు ఆఫ్ జస్టిస్ తీర్పు చెప్పింది.
షివాన్, ఆడమ్ రాఫ్( Shivaun Raff and Adam Raff )దంపతులు తమ ఫౌండమ్ వెబ్‌సైట్ ద్వారా వివిధ దుకాణాల్లో ఒకే వస్తువు ధర ఎంత ఉందో చూపించేవారు.ఇది ఒక ప్రైస్ కంపారిజన్ వెబ్‌సైట్ లాగా పనిచేసేది.కానీ, ఈ వెబ్‌సైట్ మొదలైన కొద్దికాలానికి, గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో ఈ వెబ్‌సైట్ పెద్దగా కనిపించలేదు.ఉదాహరణకు, “కంపేర్ ప్రైస్” అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే, ఫౌండమ్ వెబ్‌సైట్ టాప్ సెర్చ్ ర్యాంకింగ్ రిజల్ట్స్‌లో ముందుగా కనిపించేది కాదు.
ఆడమ్ తమ వెబ్‌సైట్ గూగుల్‌లో ఎలా కనిపిస్తోందో మొదటినుంచి గమనించారు.కొంతకాలం తర్వాత, వారి వెబ్‌సైట్ కనిపించే స్థానం ఒక్కసారిగా తగ్గిపోయిందని గమనించారు.ఇది ఏదో సాంకేతిక సమస్య అనుకుని గూగుల్ కంపెనీని సంప్రదించారు.కానీ, రెండేళ్లపాటు గూగుల్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.దీంతో, వారి వెబ్‌సైట్‌ను గూగుల్ ఉద్దేశపూర్వకంగా ఫస్ట్ సెర్చ్ రిజల్ట్స్ లో చూపించడం లేదని వారికి అనుమానం వచ్చింది.ఆ విషయమై వారు కోర్టుకు వెళ్లారు.
సుదీర్ఘ న్యాయ పోరాటంలో గూగుల్ ఓడిపోయింది.వారి సైట్ విజిబిలిటీని గూగుల్ కావాలనే తగ్గించేసింది అని తెలిసింది.ఇప్పుడు వారికి 2.4 బిలియన్ పౌండ్లు (దాదాపు రూ.26,172 కోట్లు) కోర్టు చెల్లించాలని ఆదేశించింది.దీంతో గూగుల్ ఈ అమౌంట్‌ను వారికి నష్టపరిహారంగా ఇవ్వక తప్పడం లేదు.