సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) గురించి జనాల ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు గురించి ఈనాటి తరాన్ని అడిగిన చెప్తారు.
ఇప్పుడంటే తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కలేనన్ని హీరోలు ఉన్నారు కానీ, అప్పట్లో తెలుగు హీరో అంటే ఒక్క రామారావు గారి పేరు మాత్రమే వినబడేది.ఆ తర్వాత మాత్రమే అక్కినేని వారి పేరు వినిపించేది.
ఎన్నో పౌరాణిక, సాంఘిక సినిమాలు చేసిన ఎన్టీఆర్ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.అప్పట్లో ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు, థియేటర్లో పండగ వాతావరణం నెలకొనేది.
ఇక అసలు విషయంలోకి వెళితే, సినిమా హీరోలకు డూపులు ఉండడం అప్పట్లో కూడా ఉండేదట.ఏవైనా కఠినతరమైన సీన్లు చేసేటప్పుడు లాంగ్ షాట్స్ డూప్స్ పెట్టి లాగించేసావారట.అంతవరకు ఓకే గాని, హీరోలు డ్యూయల్ రోల్స్( Hero Duel Roles ) చేసేటప్పుడు కూడా డూప్స్ ని వాడేవారట.ఇప్పుడున్న టెక్నాలజీతో డ్యూయల్ రోల్స్ చేయడం చాలా ఈజీ కానీ, అప్పట్లో అలా ఉండేది కాదు.
హీరోలు డబల్ రోల్స్ చేయాల్సి వస్తే సినిమా మేకింగ్ చాలా కఠిన తరంగా ఉండేది.ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ “రాముడు భీముడు”( Ramudu Bheemudu Movie ) సినిమాకి చాలా కష్టపడాల్సి వచ్చిందట.
ఒక సీన్ లో ఇద్దరు ఎన్టీఆర్లు మాట్లాడుకోవాల్సిన సీన్ రక్తి కట్టించాల్సిన అవసరం వచ్చింది.కానీ ఓ పట్టాన సీన్ సరిగా రాకపోవడంతో, ఎన్టీఆర్ గారికి కాస్త దగ్గర పోలికలు కలిగిన కైకాల సత్యనారాయణ( Kaikala Satyanarayana ) గారు సినిమా దర్శకుడు మదిలో మెదిలాడట.
వెంటనే కైకాల సత్యనారాయణ గారిని పిలిచి ఆసీన్ తీశారట.అది బాగా రావడంతో అక్కడినుండి కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ సినిమాలకు అవసరమైనప్పుడల్లా డూప్ గా మారారట.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ – కైకాల సత్యనారాయణ మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది.ఒక కైకాల సత్యనారాయణ గురించి జనాలకు తెలిసిందే.అప్పట్లో ఈయన ఎక్కువగా విలన్ పాత్రలకు పెట్టింది పేరు.ఆయన చేసిన దాదాపు సినిమాలన్నీ విలన్ రోల్స్ కావడం విశేషం.ఇక వయసు పెరిగే కొద్దీ సత్యనారాయణ గారు కొన్ని విలక్షణమైన పాత్రను పోషించడం జరిగింది.ఘటోత్కచుడు సినిమా ఈ కోవలోకి చెందిందే.
ఇప్పుడంటే పరాయి భాష నటులను విలన్ గా పెడుతున్నారు గాని, అప్పట్లో కేవలం తెలుగు భాష నటులనే ఎక్కువగా విలన్ పాత్రలకి తీసుకునేవారు.