మరొక వారం రోజులలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు( US Presidential Elections ) జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) ట్రంప్ మద్దతుదారులను( Trump Supporters ) చెత్తతో పోల్చడం తీవ్ర వివాదానికి తెర తీసిన సంగతి అందరికీ విదితమే.ఈ వాక్యాలపై మాజీ అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్( Donald Trump ) చాల వినూతనంగా స్పందించారు.“మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ” అని రాసి ఉన్న ఒక చెత్త లారీని( Garbage Truck ) డోనాల్డ్ ట్రంప్ నడిపారు.ఇలా లారీని నడుపుతూ ఇసుకనిస్ విమానాశ్రయంలో కనబడ్డారు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.అయితే మరొకవైపు ఈ చెత్త ట్రక్ మీకు నచ్చిందా అని అడగగా.? ఈ ట్రక్ కమల గౌరవార్థం అని ట్రంప్ అక్కడి విలేకరులతో తెలియచేసినట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా.మరోవైపు ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్( Kamala Harris ) బైడెన్ కూడా ఈ వాక్యాలపై తీవ్రంగా ఖండించారు.కమలాహారిస్ ‘ప్రజలు ఎవరికి ఓటు వేస్తారనే దాని ఆధారంగా వారిపై విమర్శలు చేయడాన్ని నేను తీవ్రంగా విభేదిస్తాను’ అంటూ ఆమె తెలియజేశారు.ఇటీవలే ట్రంప్ ర్యాలీలో హాస్యనటుడు హించ్‌క్లిప్ కూడా పాల్గొన్నారు.
ఈ క్రమంలో అతను ప్రోటోరితో చతద్వీపంగా పేర్కొనడం తీవ్ర వివాదాన్ని నెలకొంది.ఈ సంఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.
‘అక్కడ తేలుతున్న ఏకైక చెత్త ఆయన మద్దతుదారులే’ అంటూ తెలియజేశాడు.

దీంతో ఈ వాక్యాలు అంతా కూడా చాలా తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.ఇలా బైడెన్ వ్యాఖ్యలు హించ్‌క్లిప్‌ని ఉద్దేశించినవని ట్రంప్ మద్దతుదారుల గురించి కాదని వైట్ హౌస్ స్పష్టంగా తెలియజేసింది.ఈ విషయంపై బైడెన్ కూడా స్పందించినట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనా కానీ.ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ ఇలా చెత్త ట్రాక్టర్ పై విమానాశ్రమంలో ఇలా తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.







