ఆమె నన్ను ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా మార్చింది : హీరో సూర్య

దాదాపు ఏడేళ్లకు పైగా ప్రేమలో ఉండి 2006లో పెళ్లి అనుబంధంతో ఒకటయ్యారు తమిళ స్టార్ హీరో సూర్య( Hero Surya ) మరియు జ్యోతిక.( Jyothika ) వీరి పెళ్లి ప్రేమ గురించి చాలామందికి తెలుసు.

 Hero Surya About Jyothika Details, Surya , Jyothika, Surya Wife Jyothika, Kanguv-TeluguStop.com

అలాగే ఈ జంటకు ఇద్దరు పిల్లలున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే.అయితే ప్రేమ, పెళ్లిళ్లు అనేవి సినిమా ఇండస్ట్రీలో కామన్ కానీ ఒక స్త్రీ వల్ల ఏ వ్యక్తి జీవితం అయితే బాగుంటుందో అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదు.

హీరోలు కూడా చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు కానీ జ్యోతిక లాంటి ఒక అమ్మాయి దొరకడం నిజంగా సూర్య చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

Telugu Surya, Jyothika, Kanguva, Surya Jyothika, Suryajyothika, Surya Perfect-Mo

బాంబేలో పుట్టి పెరిగిన జ్యోతిక అక్కడి వాతావరణం లో ఎలా ఉండాలో ఏంటో నేర్చుకుని తమిళనాడు సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కూడా కొనసాగింది.వీరు ఇద్దరు కలిసి అనేక సినిమాల్లో నటించారు.ఆ క్రమం లోనే వీరుప్రేమలో పడ్డారు.

అయితే మొదట పెళ్లికి ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో రహస్యంగా సైతం వివాహం చేసుకున్నారట.ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంట్లో వారు ఒప్పుకోవడంతో బహిరంగంగా 2006లో సెప్టెంబర్ 11 తారీఖున మూడుముళ్ల బంధంతో మరోసారి పెద్దల ముందు వివాహం చేసుకున్నారు.

అయితే వివాహం జరిగిన రోజు నుంచి జ్యోతిక సూర్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేదట.కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీని( Cinema Industry ) వదిలేసి కుటుంబం కోసమే సమయం కేటాయించి పిల్లలు పుట్టాక పిల్లల కోసం ఆ తర్వాత అత్తమామల కోసం అంటూ తన జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా ఆమె వెనుకాడ లేదు.

Telugu Surya, Jyothika, Kanguva, Surya Jyothika, Suryajyothika, Surya Perfect-Mo

ఇలా అన్ని రకాలుగా సూర్యను స్టార్ హీరోగా( Star Hero ) నిలిపేందుకు కావలసిన జాగ్రత్తలు జ్యోతిక తీసుకునేదట.కెరియర్ విషయంలో కూడా అవసరం మేరకు సలహాలు ఇచ్చేదట. అలాగే ఒక మంచి వ్యక్తిగా నిలబడాలంటే కావాల్సిన సోషల్ సర్వీస్( Social Service ) అలాగే ఫ్యాన్స్ గురించిన విషయాల్లో కూడా జ్యోతిక ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారట.ఇలా ఉండటం వల్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తను ఇంత పర్ఫెక్ట్ హస్బెండ్ గా అలాగే మంచి వ్యక్తిగా మారడానికి పూర్తిగా తన భార్య సహకారమే ఉంది అంటూ ఒక స్టేజిపై ఇటీవల సూర్య చెప్పడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube