సాధారణంగా స్టార్ హీరోలందరూ సినిమాలలో అద్భుతంగా యాక్ట్ చేసి తమ నటనతో ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.అయితే ప్రతి సన్నివేశంలో అద్భుతమైన నటనను కనబరచడం అంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.
దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) కే దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ లో ఎవరూ యాక్ట్ చేయలేరంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్( Acting skills ) ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.ఒక విధంగా చెప్పాలంటే దేవర( Devara ) సినిమాలోని కొన్ని సాధారణ సన్నివేశాలను సైతం తన అసాధారణ ప్రతిభతో తారక్ నిలబెట్టారనే చెప్పాలి.
దేవర, వర పాత్రల మధ్య వేరియేషన్ ను తారక్ అద్భుతంగా చూపించారు.
రెండు రోజుల్లో దేవర ఏకంగా 124 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుని అదరగొట్టింది.దేవర సినిమాకు టార్గెట్ మరీ భారీ టార్గెట్ కాకపోవడంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దేవర ఈరోజు సాధించే కలెక్షన్లతో 80 శాతం టార్గెట్ ను దేవర రీచ్ అయినట్టేనని చెప్పవచ్చు.
వీక్ డేస్ లో దేవర మూవీకి వసూళ్లు తగ్గినా మరీ ఘోరంగా తగ్గే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు.దేవర సినిమా 2024 భారీ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటని చెప్పవచ్చు.పెద్ద హీరోల సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతూ కలెక్షన్ల విషయంలో ఒక విధంగా అద్భుతం చేస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.దేవర సోలో హీరోగా తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.