నేటి కాలంలో క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో నానా ఇబ్బందులు పుడుతున్నారు.విద్యార్థులు, ఉద్యోగుస్తులు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా.
ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఈ మైగ్రేన్ తలనొప్పి పట్టి పీడిస్తోంది.మైగ్రేన్ తలనొప్పి అత్యధిక శాతం మందిలో తలకు ఒకవేపు మాత్రమే వస్తుంది.
మైగ్రేట్ తలనొప్పి ఉన్న వారు.ప్రశాంతంగా ఉండలేరు.
ఏ పనిపైనా దృష్టి సారించలేరు.తల పగిలిపోయినంత నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే ఇలాంటి వారు.వైద్యపరంగానే కాకుండా కొన్ని కొన్ని న్యాచురల్ టిప్స్‌ను కూడా ఫాలో అయితే సులువుగా మైగ్రేన్ తలనొప్పిని నివారించుకోవచ్చు.మరి మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ఆ న్యాచురల్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టడంతో మెగ్నిషియం అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి, మైగ్రేన్‌తో బాధ పడుతున్నారు ప్రతి రోజు మెగ్నిషియం పుష్కలంగా ఉండే చిలకడదుంపలు, పాలకూర, పొద్దుతిరుగుడు విత్తనాలు, తృణధాన్యాలు వంటివి తీసుకోవాలి.

అలాగే కొబ్బరి నూనెతో తల, మెడపై పావు గంట లేదా ఇరవై నిమిషాల పాటు మసాజ్ చేయించుకుంటే.మైగ్రేన్ నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.అలాగే మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్న వారు.
ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేటడ్‌గా ఉంచుకోవాలి.అంటే వారట్ ఎక్కువగా తీసుకోవాలి.
లేదంటే మైగ్రేన్ తలనొప్పి మరింత తీవ్రంగా మారుతుంది.కాఫీ, టీలను ఎక్కువగా తాగకూడదు.
స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లకు దూరంగా ఉండాలి.
అదేవిధంగా, మైగ్రేన్ సమస్యను నివారించడంతో లావెండర్ ఆయిల్ గ్రేట్‌గా సహాయపడుతుంది.
లావెండర్ ఆయిల్‌ను మెడపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేస్తే.మంచి ఉపశమనం పొందగలుగుతారు.
గంధం కూడా మైగ్రేన్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.స్వచ్ఛమైన గంధాన్ని తలకు పట్టిస్తే.
మంచి ఫలితం ఉంటుంది.మైగ్రైన్ కు చెక్ పెట్టాలంటే.
ప్రతి రోజు వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి.అలాగే రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
ఇక మైగ్రేన్ తీవ్రంగా వచ్చినప్పుడు ప్రశాంతగా ఉన్న ఒక చికటి గదిలో నిద్రపోతే త్వరగా ఉపశమనం లభిస్తుంది.