సోషల్ మీడియా( Social media )లో పాపులర్ కావడానికి నేటి యువత చేయరాని పనులు చేస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.ఇలాంటి ఘటన వల్ల ఇప్పటికే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
ముఖ్యంగా రోడ్లపై, రైలు ప్రయాణాల్లో చేసే ప్రమాదకర సంఘటన ద్వారా అనేకమంది ప్రాణాలను కూడా కోల్పోయారు.తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.
ఆమెట్టి ప్రాంతంలోని జాతీయ రహదారి( National Highway)పై ఉన్న సైన్ బోర్డు పైకి ఎక్కి మరీ పుల్ అప్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగు వైరల్ గా మారింది.జాతీయ రహదారి చేసిన ఈ ప్రమాదకర స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొట్టేస్తుంది.భూమిపై నుంచి సుమారు పది మీటర్లకు పైగా ఎత్తులో అతడు సైన్ బోర్డు పై వేలాడుతూ ఈ ప్రమాదకరమైన స్టంట్ చేశాడు.
ఒకవేళ ఆ యువకుడు పైకి ఎక్కిన సమయంలో ఏ మాత్రం పట్టు జారిన అతడి ప్రాణాలు ప్రమాదంలో పడడం గ్యారెంటీ.అతడు సైన్ బోర్డు పైకి ఎక్కి ఆ పని చేస్తున్న సమయంలో మరో వ్యక్తి అతని పక్కనే ఉండడం వీడియోలో కనబడుతుంది.
మరొక వ్యక్తి ఆ విన్యాసాన్ని వీడియోలో రికార్డు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు చూసి అతనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిల్స్ ( Reels )చేయాలి కానీ.ఇటువంటి పనులు చేయొద్దంటూ కొందరు జాగ్రత్తలు చెప్పుతుండగా., మరికొందరేమో., ఇలాంటి వ్యక్తులను పోలీసులు వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కూడా స్పందించారు.ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతుందని.
ఇటువంటి ప్రమాదకర సంఘటనలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.