రాముడు, సీత నేపథ్యంలో చాలా తెలుగు సినిమాలు వచ్చాయి.వాటిలో బాపు దర్శకత్వంలో వచ్చిన “సీతా కళ్యాణం (1976)”( Seetha Kalyanam ) సూపర్ హిట్ అయింది.
దీనికి చాలా అవార్డులు కూడా వచ్చాయి.ఈ పౌరాణిక చిత్రానికి కొనసాగింపుగా 1977లో వచ్చిన “సీతారామ వనవాసము”( Seetharama Vanavasam ) మాత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు.
దీనికి అసలు ఏ అవార్డులు కూడా రాలేదు.ఈ సినిమా తెలుగుతో పాటు మరో మూడు భాషలలో రిలీజ్ అయింది.
కమలాకర కామేశ్వరరావు “సీతారామ వనవాసము” సినిమాకు కాస్తో కూస్తో పేరు వచ్చి ఉంటుందేమో కానీ లాభాలు మాత్రం శూన్యం.నిర్మాత పింజల సుబ్బారావు ఈ సినిమాతో బాగా నష్టపోయారు.
జానపదాలు తీసి ప్రాఫిట్స్ అందుకుని ఆ డబ్బులతోనే ఇట్లాంటి పౌరాణిక సినిమాలు తీసేవారు సుబ్బారావు.అయితే సీతారామ వనవాసము తర్వాత ఆయన పూర్తిగా నష్టాల పాలై చివరికి సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు.
బాపు తీసిన సీతా కళ్యాణం, అలాగే కమలాకర కామేశ్వరరావు తీసిన “సీతారామ వనవాసము” రెండు సినిమాల్లో కూడా నటుడు రవి( Actor Ravi ) శ్రీరాముడి పాత్రలో నటించారు.అయితే సీతా కళ్యాణం రిలీజ్ అయ్యాక శ్రీరాముడి పాత్రకు ఆయన సూట్ కారు అని ప్రేక్షకులు దర్శకనిర్మాతలకు మొరపెట్టుకున్నారు.అయినా పింజల అతన్ని తన సీతారామ వనవాసములో రాముడి క్యారెక్టర్ కి తీసుకొని పెద్ద తప్పు చేశారు.రవి కాకుండా ఏ శోభన్ బాబు వంటి నటుడినో తీసుకొని ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా షిఫ్ట్ అయి ఉండేది అని కొంతమంది అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తుంటారు.
ఈ సినిమాలో దర్శకుడు అనేక ప్రయోగాలు చేసివరికి నిర్మాతను పూర్తిగా ముంచేశారు.కైకగా విజయలలిత , లక్ష్మణుడిగా ప్రసాద్ బాబు వంటివి తీసుకుని ఎక్స్‌పరిమెంట్ చేశారు.సినిమాలో నాగరాజు , జమున వంటి పాత్రలూ బాగోలేదు.ఇంకో వరస్ట్ ఏంటంటే, ఇందులో సీతారామ కల్యాణం తర్వాత ఫస్ట్ నైట్ సీన్ పెట్టారు.దర్శకుడికి బహుశా మైండ్ పని చేసి ఉండకపోవచ్చు, లేకపోతే ఇలాంటి సీన్ పెట్టడం ఏంటి అని అప్పట్లో ప్రేక్షకులు తీవ్రంగా విమర్శలు కూడా చేశారు.శ్రీరాముడికి లవ్ సీన్లు, ఫస్ట్ నైట్ సీన్లు ప్రేక్షకులకు ఏ మాత్రమూ నచ్చవు అని ఆయన తెలుసుకోకపోవడం దురదృష్టకరం.
ప్రజల్లో దృష్టిలో రాముడు విష్ణువుని మించిన దేవుడు.అంతా పరమ పవిత్రమైన అంటే ఏమిటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇక ఈ సినిమాలో సత్యనారాయణ రావణుడి పాత్రలో అదరగొట్టేసాడు.యస్వీఆర్ ను మైమరిపించాడు.జయప్రద( Jayaprada ) సీతగా చాలా అందంగా కనిపించింది.అంతేకాదు చక్కటి హావభావాలతో ప్రేక్షకులను బాగా మెప్పించింది.
గుమ్మడి దశరథుడిగా చాలా అద్భుతంగా నటించాడు.
కౌసల్యగా అంజలీదేవి , సుమిత్రగా ఝాన్సీ , మండోదరిగా బి సరోజాదేవి , శబరిగా జమున , అనసూయగా పండరీబాయి ఒదిగిపోయారు.
రామాయణం( Ramayanam ) మీద లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి.బాహుబలి , ఆర్‌ఆర్ఆర్, కల్కి వంటి సినిమాలు వస్తున్న సమయంలోనూ రామాయణం ఆధారంగా ఆదిపురుష్ మూవీ( Adipurush ) వచ్చింది అది సరిగా తీయలేదు కానీ లేకపోతే మంచి హిట్ అయి ఉండేది.
ప్రభాస్( Prabhas ) ఈ సినిమాలో రాముడిగా చేశాడు.అంతగా సెట్ కాలేదు.అయితే సీతారామ వనవాసము సినిమాలో రవిని రాముడిగా చూస్తే, ఆ పాత్రకు ప్రభాసే నయం అనిపిస్తుంది.ఇక హిందీలో ఇంతకుముందు దాకా ప్రసారమైన జానకిరాముడు హిందీ సీరియల్ తెలుగులో కూడా వచ్చి సూపర్ హిట్ అయింది.
1977లో వచ్చిన ఈ సీతారామ వనవాసము సినిమాకు కె.వి మహదేవన్ కంపోజ్ చేసిన పాటలు బాగానే ఉన్నాయి కానీ మెయిన్ క్యారెక్టర్ అయినా రాముడు పాత్ర బాగోలేకపోవడం వల్ల ఈ సినిమా ఆది పురుష్ కంటే పెద్ద డిజాస్టర్ అయ్యింది.