ఈ అలవాటు వలన తండ్రి అయ్యే అవకాశం కోల్పోతారేమో !

ధూమపానం వలన వచ్చే లాభం ఒక్కటంటే ఒక్కటి ఉన్నా, స్మోకింగ్ మానేయాల్సిన అవసరం లేదు.కాని అలాంటి పరిస్థితి లేదే.

 This Is How Smoking Effects Fertility In Men-TeluguStop.com

ధూమపానం ఏరకంగానూ ఆరోగ్యానికి మంచిది కాదు.వీర్యంలో DNA ని కూడా డామేజ్ చేయగల విషం స్మోకింగ్ లో ఉందని తాజాగా జరిగిన కొన్ని అధ్యయనాలు నొక్కి నొక్కి చెబుతున్నాయి.

“ఇప్పటివరకు స్మోకింగ్ పురుషులు వీర్యం మీద చూపించే ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి.ప్రతి రీసెర్చిలో ప్రమాదాల కౌంట్ పెరుగుతోందే తప్ప, తగ్గట్లేదు.

స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉంటే, అది వీర్యాన్ని బలహీనపరచడమే కాదు, సెమెన్ లో DNA ని కూడా డ్యామేజ్ చేస్తుంది.ఇది పుట్టబోయే బిడ్డలకు పెద్ద ప్రమాదంగా మారుతుంది.

సంతానం ఆలస్యంగా కలగొచ్చు, అసలు కలగకపోవచ్చు.పుట్టిన బిడ్డకు ఎన్నో సమస్యలు రావొచ్చు.

ఇలా ఎన్నోరకాలుగా వీర్యానికి పెద్ద శతృవుగా మారుతోంది ధూమపానం” అంటూ డాక్టర్ రికార్డో పిమెంటా బెర్టొల్లా చెప్పుకొచ్చారు.

స్మోకింగ్ అంగస్తంభనలను ప్రభావితం చేస్తుంది.

పురుషాంగాన్ని బలహీనపరుస్తుంది.స్పెర్మ్ లోని DNA కి నష్టం చేకూరుస్తుంది.

భర్తకి స్మోకింగ్ అలవాటు ఉంటే భార్యకి కూడా ప్రమాదమే.మగవారి అలవాటు ఆడవారి సెక్స్ డ్రైవ్ ని కూడా బలహీనపరుస్తుందట.

అలాగే స్మోకర్స్ భర్తలుగా ఉన్న స్త్రీలు మిగితా వారికంటే త్వరగా మెనోపాజ్ దశకి చేరుకుంటారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube