Children malnutrition effects : పిల్లల్లో పోషకాహార లోపాన్ని ఎలా గుర్తించ‌వ‌చ్చో తెలుసా?

పోషకాహార లోపం.పిల్లల్లో సర్వసాధారణంగా తలెత్తే సమస్య ఇది.సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటి ఫుడ్స్ ఇచ్చిన తినమ‌ని మారం చేస్తుంటారు.ఈ క్రమంలోనే వారి శరీరానికి అందాల్సిన పోషకాలు అందకుండా పోతాయి.

 Do You Know How To Spot Malnutrition In Children? Malnutrition, Malnutrition In-TeluguStop.com

దీంతో పోషకాహార లోపం తలెత్తుతుంది.అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు పోషకాహార లోపానికి గురయ్యారు అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.

ఈ కారణంగా పిల్లల ఆరోగ్యం మరింత డేంజర్ జోన్ లో పడుతుంది.దీర్ఘకాలంగా పోషకాహారం లోపిస్తే పెరుగుతున్న పిల్లల్లో ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

అందుకే పిల్లల‌ను ఓ కంట కనిపెడుతూనే ఉండాలి.అసలు ఇంతకీ పిల్లలు పోషకాహార లోపానికి గురయ్యారు అన్నది ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాహార లోపం ఏర్పడినప్పుడు పిల్లలు ఎప్పుడూ నీరసంగా, నిరుత్సాహంగా కనిపిస్తుంటారు.ఏ పని చేయలేక పోతుంటారు.చ‌దువుతో పాటు ఆటపాటల్లో చురుగ్గా పాల్గొనలేకపోతుంటారు.ఆందోళన కుంగుబాటు వంటి పిల్ల‌ల్లో అధికంగా క‌నిపిస్తుంటాయి.

అలాగే కొందరు పిల్లలు చిన్న వయసులోనే ఊబ‌కాయం బారిన పడుతుంటారు.ఊబ‌కాయానికి పోషకాహార లోపం కూడా ఒక కారణం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ పిల్లలు ఊబ‌కాయం బారిన పడితే కచ్చితంగా పోషకాహార లోపం అని తల్లిదండ్రులు గ్రహించాలి.

Telugu Tips, Latest, Effects-Telugu Health Tips

పోషకాహార లోపం వల్ల రోగ నిరోధక వ్యవస్థ సైతం దెబ్బ తింటుంది.దీంతో పిల్లలు ఫ్లూ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.పిల్లలు తరచూ ఫ్లూ సమస్యలతో బాధపడుతున్నారు అంటే వారి శరీరానికి కావలసిన పోషక విలువలు సమపాళ్లలో అందడం లేదని అర్థం చేసుకోవాలి.

అప్పుడు వారి డైట్ లో విటమిన్స్, మినరల్స్, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు ఇలా అన్నీ ఉండేలా చూసుకోవాలి.అప్పుడే పిల్లల ఎదుగుదల సక్రమంగా ముందుకు సాగుతోంది.

లేదంటే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తూనే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube