Mahesh Babu Allu Arjun : మళ్ళీ వరుస షూటింగులతో బిజీ బిజీగా మారనున్న టాలీవుడ్ స్టార్స్!

టాలీవుడ్ లో ఒక్కో స్టార్ హీరో మినిమమ్ రెండు మూడు భారీ ప్రాజెక్టులు చేతిలో పెట్టుకుని ఉన్నారు.కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు అందరి టైం వృధా అయ్యింది.

 These Are The Tollywood Star Heroes Busy In Shootings, Tollywood, Tollywood Star-TeluguStop.com

దీంతో కరోనా తగ్గగానే ఇప్పుడు అందరు దొరికినన్ని ప్రాజెక్టులు లైన్లో పెట్టుకుంటున్నారు.అయితే చేతిలో సినిమాలు ఉన్నప్పటికీ ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం షూటింగ్ లకు వెళ్లకుండా ఖాళీగా ఉంటున్నారు.

వీరి చేతిలో వరుస సినిమాలు ఉన్నా ప్రాజెక్టులు మాత్రం పట్టాలు ఎక్కించకుండా ఖాళీగానే ఉంటున్నారు.కొంత మంది షూటింగ్ స్టార్ట్ చేసిన కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఖాళీగా ఉంటున్నారు.

ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ప్రెసెంట్ చేతిలో సినిమాలు ఉన్నా కూడా ఖాళీగా ఉంటున్నారు.అయితే వీరంతా అతి త్వరలోనే షూటింగులతో బిజీ కానున్నారు.

మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ కొత్త సినిమా షూట్ స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ పూర్తి చేసారు.

కానీ కొన్ని కారణాల వల్ల రెండో షెడ్యూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు.ఇక ఈ వారంలోనే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.

Telugu Allu Arjun, Koratala Shiva, Mahesh Babu, Ram Charan, Shankar, Tollywood-M

రామ్ చరణ్.ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాతో విజయం సాధించాడు.అయితే మధ్యలో ఆచార్య సినిమా ప్లాప్ అయ్యింది.ప్రెసెంట్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్నాడు.ఇటీవలే భార్యతో వెకేషన్ వెళ్లిన ఈయన నిన్న ఇండియాకు వచ్చాడు.ఇక ఈ సినిమా షూట్ కూడా ఈ వారంలోనే స్టార్ట్ కాబోతుందట.

Telugu Allu Arjun, Koratala Shiva, Mahesh Babu, Ram Charan, Shankar, Tollywood-M

అలాగే ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.అయితే ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నా కూడా ఈయన ఇంకా ఈ సినిమా స్టార్ట్ చేయలేదు.మరి ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారట.

Telugu Allu Arjun, Koratala Shiva, Mahesh Babu, Ram Charan, Shankar, Tollywood-M

అల్లు అర్జున్.పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకుని అఖండమైన విజయం సొంతం చేసుకున్నాడు.అయితే ఈ సినిమా పార్ట్ 2 కూడా తెరకెక్కుతుంది.

ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయినా పార్ట్ 2 ఇంకా స్టార్ట్ కాలేదు.త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇలా ఈ టాప్ స్టార్స్ అతి త్వరలోనే షూటింగులతో బిజీగా మారనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube