నేటి ఆధునిక కాలంలో ఒత్తిడిని ఎదుర్కోని మనిషంటూ ఎవ్వరూ ఉండరు.ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణంగా ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు.
మళ్లీ కొంత సేపటికి ఈ సమస్య నుంచి బయట పడతారు.అయితే కొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా ఒత్తిడి సమస్య నుంచి బయట పడలేకపోతుంటారు.
దీనినే అధిక ఒత్తిడి అంటారు.ఇలాంటి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే, అధిక ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే అనేక అనారోగ్య సమస్యలు చుట్టేస్తాయి.
ఇక అధిక ఒత్తిడిని దూరం చేయడంలో కొన్ని కొన్ని ఆహారాలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
అలాంటి వాటిలో గుమ్మడి గింజలు కూడా ఒకటి.గుమ్మడి గింజల్లో జింక్ మరియు విటమిన్ బి ఉంటాయి.
ఈ పోషకాలు మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ అనే రసాయనం ఉత్పత్తి అయ్యేలా చేసి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేస్తాయి.మరియు మెదడు పని తీరు కూడా మెరుగు పడేలా చేస్తాయి.
కాబట్టి, అధిక ఒత్తిడి తో బాధ పడే వారు తమ డైట్‌లో గుమ్మడి గింజలు చేర్చుకోవడం మంచిది.

అలాగే శరీరంలో మెగ్నీషియం తగ్గినప్పుడు కూడా తరచూ ఒత్తిడికి గురవుతుంటారు.అందువల్ల, బాగా ఒత్తిడిగా ఉన్న సమయంలో అరటి పండు తీసుకుంటే మంచిది.అరటి పండు మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
అందువల్ల, అరటి పండు తీసుకుంటే.త్వరగా ఒత్తిడి దూరం అవుతుంది.
నట్స్, డార్క్ చాక్లెట్స్, బ్లాక్ టీ, బొప్పాయి పండు, పెరుగు, చేపలు, గోధుమలతో తయారు చేసిన ఆహారాలు, సిట్రస్ ఫ్రూట్స్ వంటివి కూడా అధిక ఒత్తిడిని దూరంగా చేయడంలో సహాయపడతాయి.కాబట్టి, ఎవరైతే అధిక ఒత్తిడితో బాధ పడుతున్నారో వారు ఖచ్చితంగా డైట్‌లో ఈ ఆహారాలు చేర్చుకుంటే మంచిది.
అదే సమయంలో మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా కూడా ఉండాలి.అప్పుడే ఒత్తిడి దరి చేరకుండా ఉంటుంది.
.