వారాంతంలో నాగార్జున( Nagarjuna ) లాగానే ఏం జరగబోతుందని ఆత్రుత ప్రేక్షకుల్లో ఉంటుంది.ఈసారి ఎవరికీ గడ్డి పెడతాడు మరి ఎవరిని పైకి లేపుతాడు అనే ఆసక్తితో బిగ్ బాస్ ని ప్రేక్షకులు వారాంతాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు.
అయితే ఈసారి నాగార్జున నడుచుకున్న విధానంపై అందరికీ ఒక రకమైన అనుమానం వచ్చింది.ఏంటంటే శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఎవరు హీరో ఎవరు జీరో అనే విషయాన్ని ప్రతి ఒక్కరు చెప్పాలని నాగార్జున సూచించడంతో అందరూ కలిసి తమకు నచ్చిన వారిని హీరో అని జీరో అని చెప్పారు దాదాపు అందరూ మణికంఠ( Manikanta )కు జీరో అని ఇచ్చారు.
అలాగే నబిల్ మరియు పృథ్వీలను హీరో అంటూ కిరీటం పెట్టారు.ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ మాటిమాటికి పృద్వి, నిఖిల్, సోనియా గురించి ప్రస్తావన తీసుకొస్తూ వారి గురించి వారి ఆట తీరు గురించి చెబుతూ ఉండడమే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇంత సభ్యులందరూ కూడా అదే రకమైన వాదనను వ్యక్తపరచడం విశేషం.అయితే ఎందుకు మరీ మరీ సోనియా అనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ నిఖిల్ ఆట తీరును మెరుగుపరుచుకునే విధంగా సూచిస్తూ వచ్చాడు అనే విషయమే చాలామందికి అర్థం కాలేదు దీన్ని బట్టి చూస్తే నిఖిల్ కి బిగ్ బాస్ కప్పు ఇచ్చేదాకా వదలనరు అని అర్థమవుతుంది.అంతలా కప్ ఇవ్వాలని డిసైడ్ అయితే వీళ్ళందర్నీ కూర్చోబెట్టి ఆడించడం ఎందుకు డైరెక్ట్ గా నిఖిల్( Nikhil ) కి బిగ్ బాస్ సీజన్ కప్ ఇచ్చి పంపంచు కదా అనే వాదన కూడా వినిపిస్తుంది.నిఖిల్ సైతం మొదటి ఒకటి రెండు వారాలు చాలా బాగా ఆడినట్టు కనిపించిన ఇప్పుడు పూర్తిగా సోనియా ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది అతని ఆట తీరును ఆమె బాగా కంట్రోల్ లో పెట్టుకోగలిగింది.
మొదటి నుంచి ఆమె కప్ పై టార్గెట్ చేస్తున్నట్టే అనిపించినా కేవలం పెద్దోడు చిన్నోడు అంటూ ఇద్దరినీ తన చుట్టూ తిప్పుకుంటుంది.దాంతో చూసేవారికి చాలా వెగటుగా కనిపిస్తుంది.
ఇక ప్రస్తుతం సీత, ప్రేరణ, నబిల్, పృథ్వి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్న ఈ టైంలో నిఖిల్ చాలా డౌన్ అయిపోయాడు.అలాగే నైనిక కూడా తనదైన ఆట తీరును పూర్తిగా పక్కనపెట్టి ఒక డైలమాలో కనిపిస్తుంది రాను రాను ఇలాగే కొనసాగితే పృథ్విలో ఎవరో ఒకరు కప్పుకొట్టుకుని వెళ్లిపోయి అవకాశం ఉంది.