ఈ మధ్య కాలంలో చాలామంది స్టార్ హీరోలు వరుసగా రెండు హిట్లు సాధించడానికే కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మాత్రం గత పదేళ్లలో ఏకంగా 7 హిట్లను సొంతం చేసుకున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కే ఈ రికార్డ్ సాధ్యమైందని తారక్ కు ఎవరూ సాటిరారని కామెంట్లు జోరుగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
టెంపర్,( Temper ) నాన్నకు ప్రేమతో,( Nannaku Prematho ) జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్, దేవర సినిమాలతో తారక్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు.ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి షేక్ చేశాయి.2025 సంవత్సరంలో తారక్ వార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.వాస్తవానికి మాస్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయడం సులువు కాదు.
అయితే దేవర సినిమా( Devara ) మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.నార్త్ ఇండియాలో పాజిటివ్ టాక్ తో దేవర మూవీ కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.ఈ సినిమాకు అక్కడి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
రోజురోజుకు నార్త్ ఇండియాలో దేవర బుకింగ్స్ పుంజుకుంటున్నాయి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ లకు సైతం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయనే సంగతి తెలిసిందే.
హిందీలో సైతం క్రమంగా ఈ సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నాయి.బుధవారం రోజున ఈ సినిమా కలెక్షన్లు పుంజుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.ఈ వీకెండ్ సమయానికి ఈ సినిమా సులువుగానే బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.హిందీలో కలెక్షన్లు పెరిగితే దేవరకు తిరుగులేదని చెప్పవచ్చు.తారక్ కెరీర్ ప్లాన్స్ భారీ రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది.