కారులో 300 కి.మీ వేగంతో దూసుకెళ్లిన రష్యన్ యువకుడు.. ట్రక్కును గుద్దెయడంతో??

వాహనాలు నడిపే వారికి స్పీడ్‌గా వెళ్లి ఒక రకమైన థ్రిల్ పొందాలని ఉంటుంది.కానీ ఆ థ్రిల్ కోసం పాకులాడితే వారి ప్రాణాలు పోవచ్చు.

 A Young Russian Who Drove At A Speed Of 300 Km In A Car After Punching A Truck,-TeluguStop.com

ఇతరుల ప్రాణాలకూ ముప్పు తలపెడుతునట్లే అవుతుంది.యువత ఈ విషయాలను అర్థం చేసుకోకుండా చాలా వేగంగా వెళుతూ థ్రిల్ పొందుతుంటారు.

అతివేగం ప్రమాదకరం అనే హెచ్చరికను అసలు పట్టించుకోరు.అలా చాలామంది నిర్లక్ష్యంగా ప్రవర్తించి చివరికి ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా ఒక యువకుడు తన ఆడి కారును 300 కిలోమీటర్ల వేగంతో చివరికి పెద్ద యాక్షన్ చేశాడు అందులో అతను చనిపోయాడు కూడా.

వివరాల్లోకి వెళ్తే ఇటీవల టాటర్‌స్థాన్‌కు చెందిన ఓ యువ పారిశ్రామికవేత్త కారులో రోడ్ల పైకి వచ్చాడు.

తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి మాస్కోలోని ఎం-12 వోస్టోక్ టోల్ రోడ్డుపై దూసుకెళ్లడం ప్రారంభించాడు.అతివేగంగా నడపడం వల్ల ఈ రోడ్డు మీదే ఒక భయంకరమైన యాక్సిడెంట్ చేశాడు.

ఈ ప్రమాదంలో ఆయన నడుపుతున్న ఆడి కారు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఒక ట్రక్‌ను ఢీకొట్టింది.ఆ రోడ్డు ప్రమాదంలో సదరు యువ పారిశ్రామికవేత్త మరణించాడు.

Telugu Audi Rs, Speed, Road Acciden, Russia, Tatarstan, Toll Road-Telugu NRI

సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి, ఫెడోరోవో అనే గ్రామం దగ్గర ఈ ప్రమాదం జరిగింది.కారులో అమర్చిన డాష్ కెమెరా రికార్డింగ్ ప్రకారం, ట్రక్‌ మరో లేన్‌లోకి మారగానే, కొన్ని సెకన్ల తర్వాత ఆడి కారు దానిని ఢీకొట్టింది.ఆ స్పోర్ట్స్ కారు గంటకు దాదాపు 270 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు అంచనా.ఇది ఆ రోడ్డుకు నిర్ణయించిన గరిష్ట వేగం కంటే రెట్టింపు.అంత ఎక్కువ వేగంతో వెళ్లిన కారణంగా, ఆ కారు ట్రక్‌ కిందకి వెళ్లిపోయింది.ఫలితంగా కారు పైకప్పు పూర్తిగా దెబ్బతింది.25 ఏళ్ల డ్రైవర్‌ని కారు నుంచి బయటకు తీయడానికి రెస్క్యూ సిబ్బంది చాలా కష్టపడ్డారు.ఆ కారుకు నంబర్ ప్లేట్లు లేవు.

వాటిని కారు డిక్కీలో కనుగొన్నారు.

Telugu Audi Rs, Speed, Road Acciden, Russia, Tatarstan, Toll Road-Telugu NRI

ఈ ప్రమాదానికి గురైన కారు నంబరు E666EE 16.ఈ కారు యువ పారిశ్రామికవేత్తకి చెందినది.ఆయన స్నేహితులు ఆయన్ని ‘మోలోడోయ్’ అని పిలుస్తారు.

ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆయన తన ఆడి RS5 కారును గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్‌తో నడుపుతున్నాడని చూపించే ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇటీవల కాలంలో ఈ యువకుడు తన కారును చాలా వేగంగా నడిపినందుకు దాదాపు 100 జరిమానాలు కట్టాడు.ఆయనపై మొత్తం 1 లక్ష రూబిళ్లు జరిమానా విధించబడింది.https://www.facebook.com/100001358195126/videos/968961838327554/ వీడియో కొరకు పై లింక్ క్లిక్ చెయ్యండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube