ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉండడం సర్వసాధారణం.ఈ క్రమంలో వస్తువులు, ప్రొడక్ట్స్ అన్ని కూడా పోస్టల్ ద్వారా గాని , ప్రముఖ డెలివరీ ఏజెంట్స్ ద్వారా కానీ డెలివరీ చేస్తూ ఉండడం సర్వసాధారణం.
ఇక ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలు లాంటివి కూడా ఎక్కువగా పోస్టల్ ద్వారా కాల్ లెటర్స్ ఇంటర్వ్యూ, డీటెయిల్స్ పంపిస్తూ ఉండడం సర్వసాధారణం.అయితే తాజాగా ఒక పోస్టుమాన్( Postman ) నిర్లక్ష్యం కారణంగా ఒక యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం చేయి జారిపోయిన సంఘటన పెగడపల్లి మండలంలో చోటుచేసుకుంది.
కాల్ లెటర్( Call Letter ) కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూసిన కానీ పోస్ట్ మ్యాన్ కరెక్ట్ సమయంలో లెటర్ ఇవ్వకపోవడంతో ఇంటర్వ్యూ మిస్ అయ్యి ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.పెగడపల్లి మండలం( Pegadapalle Mandal ) వెంకలాయపేట గ్రామానికి చెందిన అనిల్( Anil ) అతడి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో తల్లి ఎంతో కష్టంతో ప్రభుత్వ స్కూల్లలో, కాలేజీలలో చదివించి చివరికి ఒక ప్రైవేటు లెక్చరర్ గా అతడు ఉపాధి అవకాశం వచ్చింది.దీనితోపాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అతను ఫిబ్రవరి నెలలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో( Telangana State Electricity Regulatory Commission ) ఆఫీస్ సబార్డినేట్ గా దరఖాస్తు చేసుకోగా మెరిట్ లిస్ట్ ఆధారంగా లిస్టులో చోటుకు సొంతం చేసుకున్నాడు.
అయితే ఈ క్రమంలో షార్ట్ లిస్ట్ అయిన అందరికి ఈనెల 20వ తారీకు ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలని స్పీడ్ పోస్ట్ ద్వారా అధికారులు తెలియజేశారు.ఆగస్టు 31న లెటర్ పోస్ట్ చేయగా 22 రోజుల తర్వాత పోస్ట్మాన్ సెప్టెంబర్ 23న బాధితుడికి లెటర్ ఇచ్చాడు.
అయితే పోస్ట్ మాన్ నిర్లక్ష్యం కారణంగా ఇంటర్వ్యూ లెటర్ సరైన సమయంలో అతనికి చేరకపోవడంతో ఇంటర్వ్యూకి హాజరు కాలేకపోయానని తనకు న్యాయం జరగాలని అనిల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.అయితే, ఈ సంఘటనలో మరొక ట్విస్ట్ ఏమిటి అంటే.వెంకలాయిపేట పోస్టుమాన్ రమాపతిరావు కరీంనగర్ లో ఉన్నట్లు అక్కడివారు తెలియచేస్తున్నారు.దీంతో తనయుడు తండ్రి గోపాలరావు విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.గతంలో కూడా ఈ పోస్ట్ మాన్ వల్ల పలు సంఘటనలు జరిగినట్లు అక్కడి గ్రామస్తులు తెలిపారు.అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా కొడుకు స్థానంలో తండ్రి విధులు నిర్వహిస్తుండడం అధికారులు పట్టించుకోవడం లేదా అంటూ పలు అనుమానాలు కూడా వస్తున్నాయి.