నెయ్యి.ప్రపంచవ్యాప్తంగా దీనిని కాస్త ఎక్కువగానే వాడుతుంటారు.ఎన్నో రకాల వంటల్లో నెయ్యిని ఉపయోగిస్తారు.నెయ్యిని ఎందులో వాడినా.రుచి అద్భుతంగా ఉంటుంది.నెయ్యిని అమితంగా ఇష్టపడేవారు కోట్లలో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.
అయితే కొందరు నెయ్యి పేరు చెబితేనే భయపడిపోతారు.నెయ్యి తీసుకుంటే బరువు పెరిగిపోతారన్న భయమే అందుకు కారణం.
ఈ క్రమంలోనే నెయ్యి ఎంత ఇష్టం అయినప్పటికీ.దానికి దూరంగా ఉంటారు.
కానీ, నిజానికి రెగ్యులర్‌గా తగిన మోతాదులో నెయ్యిని తీసుకుంటే.నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉంటాయి.మరి ఇంతకీ నెయ్యిని రోజుకు ఎంత తీసుకోవాలి అంటే.ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకునే ఆహారాల్లో ఒక స్పూన్ చప్పున మూడు స్పూన్లు నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
రోజుకు మూడు స్పూన్ల చప్పున నెయ్యి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు.పైగా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.
రెగ్యలర్‌గా నెయ్యిని తీసుకోవడం వల్ల మతిమరుపు దూరం అవుతుంది.నెయ్యిలో ఉండే పలు పోషకాలు బ్రెయిన్ సెల్స్ ని మరింత యాక్టీవ్‌గా పని చేసేలా సహాయపడతాయి.అదే సమయంలో జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తాయి.అలాగే నెయ్యిలో ఉండే విటమిన్- ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది.విటమిన్- ఈ చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతుంది.కేశాలు కూడా దృఢంగా, ఒత్తుగా పెరిగేందుకు నెయ్యి యూజ్ అవుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక స్నూన్ నెయ్యి తీసుకుంటే. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.ముఖ్యంగా మలబద్ధకం ఉన్న వారికి నెయ్యి అద్భుతంగా ఉపయోగపడుతుంది.ఇక నేటి ఆధునిక కాలంలో చాలా మంది నిద్ర లేమి సమస్యతో బాధ పడుతున్నారు.
అయితే నిద్ర లేమి సమస్య ఉన్న వారు రెగ్యులర్‌గా నెయ్యి తీసుకుంటే.చక్కని నిద్ర పడుతుంది.