వింట‌ర్ లో మార్నింగ్ వాక్ కు వెళ్తున్నారా.. అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!

సాధారణంగా మార్నింగ్ వాక్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.రోజు ఉదయం కాసేపు వాకింగ్ చేయడం వల్ల మన మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.

 Can You Go For A Morning Walk In Winter , Morning Walk, Morning Walk Health-TeluguStop.com

మైండ్ రిఫ్రెష్ అవుతుంది.ఒత్తిడి దూరం అవుతుంది.

అలాగే మార్నింగ్ వాక్ వల్ల మన ఎనర్జీ లెవెల్స్ సహజంగానే పెరుగుతాయి.మధుమేహం ( Diabetes )వచ్చే రిస్క్ తగ్గుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే మార్నింగ్ వాక్ వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.

Telugu Tips, Latest, Walk, Walk Benefits-Telugu Health

అందుకే చాలా మంది మార్నింగ్ వాక్( Morning walk ) ను త‌మ డైలీ రొటీన్ లో భాగం చేసుకుంటారు.అయితే ప్రస్తుత చలికాలంలో ( Winter )ఉదయం వేళ మంచు అధికంగా ఉంటుంది.అందువల్ల వింటర్ లో మార్నింగ్ వాక్ చేయవచ్చా.? చేయకూడదా.? అనే డౌట్ ఎంతో మందికి ఉంటుంది.వాస్తవంగా చెప్పాలంటే ఆస్తమా, న్యుమోనియా, గుండె సమస్యలు ఉన్నవారు ఈ చలికాలంలో మార్నింగ్ వాక్ ను స్కిప్ చేయడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి వారు సాయంత్రం వేళ వాకింగ్ కు వెళ్లొచ్చు.

వీరు మినహా మిగిలిన వారంతా మార్నింగ్ వాక్ చేయ‌వ‌చ్చు.అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా పాటించాలి.

వింట‌ర్‌ సీజన్ లో ఉదయం వేళ వాకింగ్ చేయడానికి వెళ్లేవారు ఎక్కువ బరువు మరియు టైట్ గా ఉండే దుస్తులు వేసుకోకూడదు.

Telugu Tips, Latest, Walk, Walk Benefits-Telugu Health

కొంచెం లైట్ వెయిట్ మరియు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.ఆ దుస్తులు మీకు మంచి వెచ్చదనాన్ని అందించే విధంగా ఉండాలి.అలాగే చెవుల్లోకి గాలి వెళ్లకుండా తలకు క్యాప్‌, చేతులకు గ్లౌసులు మరియు కాళ్ళకు షూస్‌ వేసుకోవాలి.

అలాగే ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం కరెక్ట్ కాదు.కనీసం వాటర్ అయినా తీసుకుని వాకింగ్ కు బయలుదేరాలి.

సూర్య రశ్మి వస్తున్న టైం లో నడిస్తే ఇంకా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube