పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో( Social media ) వైరల్ అవుతూ ఎంతో ఆకట్టుకుంటుంటాయి.మనుషులకు, పెంపుడు జంతువులకు మధ్య మోస్ట్ బ్యూటిఫుల్ బాండ్ ఉంటుందని చెప్పుకోవచ్చు.
మనుషుల కోసం జంతువుల ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అవుతుంటాయి.వీరి మధ్య చోటు చేసుకునే కొన్ని క్షణాలు చూస్తే ఫిదా అవకుండా ఉండలేం.
తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో ఒక యజమాని తన కుక్కను బ్యాక్ ప్యాక్ లో ఉంచాడు.దానిని అలా వీపుపై మోస్తూ ఒక కొండ ప్రాంతంలో స్కేటింగ్( Skating ) చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.తన కుక్కకు కాళ్ళు నొప్పి పెడతాయని దానిని భుజాన ఎక్కించుకొని అతడు తీసుకెళ్తున్న దృశ్యం చాలామందిని భావోద్వేగానికి గురిచేసింది.
కారులో వెళ్తున్న ఒక వ్యక్తి ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ రికార్డ్ చేశారు.ఆ సమయంలో క్యూట్ డాగ్ కెమెరా వైపే చూసింది.
@Enezator షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 34 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.ఈ క్లిప్ చూసి చాలామంది నెటిజన్లు వావ్ అంటున్నారు.తమ కుక్కను( Dog ) కూడా ఇలా తీసుకువెళ్లడానికి తాము ఇష్టపడతామని చెబుతున్నారు.యజమానితో సహా కుక్క ఆ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ హాయిగా గడుపుతోందని మరొక యూజర్ పేర్కొన్నాడు.
ఇది చాలా బ్యూటిఫుల్ సైట్, ఆ యజమాని కుక్క వారి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా ఉన్నాయని మరికొందరు అన్నారు.మొత్తం మీద ఈ వీడియో ( Viral video )చాలా మంది మనసులను దోచేసింది.
దీనిని మీరు కూడా చూసేయండి.