సాధారణంగా చాలామంది హీరోలు ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడతారు.ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమా అంటే ఒకింత రిస్క్ అని భావిస్తారు.
అయితే గత పదేళ్లలో ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్లు ఇచ్చి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో నిలిచారు.టెంపర్ సినిమాకు ముందు పూరీ జగన్నాథ్ ( Puri Jagannadh )ఖాతాలో పెద్దగా హిట్లు లేవు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడంతో పూరీ జగన్నాథ్ ప్రూవ్ చేసుకున్నారు.
టెంపర్ మూవీ( Temper ) బాక్సాఫీ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. 1 నేనొక్కడినే సినిమాతో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్న సుకుమార్ కు తారక్ ఛాన్స్ ఇవ్వగా నాన్నకు ప్రేమతో సినిమాతో తారక్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.సుకుమార్ ఈ సినిమాతో టాలీవుడ్ లో మళ్లీ బిజీ అయ్యారు.
రంగస్థలం, పుష్ప సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నారు.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్న బాబీకి తారక్ ఛాన్స్ ఇవ్వగా జై లవకుశ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది.జై లవకుశ సినిమాతో జై పాత్రలో తారక్ ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో మెప్పించారు.అజ్ఞాతవాసి సినిమాతో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వగా అరవింద సమేత వీర రాఘవ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.
ఆచార్య సినిమా( Acharya )తో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్న కొరటాల శివ దేవర సినిమాతో హిట్ సాదించారని చెప్పవచ్చు.దేవర మూవీ కలెక్షన్లను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
చాలా ఏరియాలలో ఈ సినిమా 50 శాతానికి పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.టార్గెట్ ను ఈ సినిమా సులువుగానే రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ హీరో అని అభిమానులు భావిస్తున్నారు.