సాధారణంగా మనం ఎవరినైనా సరే అవతలి వాళ్ళు ఏం చెప్పారు దాన్నిబట్టే ఒక అభిప్రాయానికి వస్తూ ఉంటాం.అది మంచి అభిప్రాయమైన చెడు అభిప్రాయమైన అదే మన మనసులో నాటుకుపోతుంది.
కొన్ని ఇంటర్వ్యూస్ లో కొంతమంది సెలబ్రిటీష్ వారి నోటికొచ్చింది చెప్పి కొన్ని వార్తలు వైరల్ చేస్తూ ఉంటారు.అలాంటి కొన్ని వార్తలు దర్శకుడు రవిబాబు గురించి అనేకసార్లు మనం విన్నాం.
ఒక హీరోయిన్ ఏదో చెప్పిందని అతడి క్యారెక్టర్ని చాలా ఈజీగా జనాలు జడ్జ్ చేయడం మొదలుపెట్టేశారు.అయితే చలపతిరావు తన కుమారుడు గోల్డ్ మెడలిస్ట్ అని నటుడు అని అలాగే మంచి టెక్నీషియన్ అని పలుమార్లు చెప్పినా అది మాత్రం మన బుర్రకు పెద్దగా ఎక్కలేదు.
రవిబాబు నిజానికి ఎంతో తెలివైన దర్శకుడు మరియు నటుడు.అందుకు అతడు తీసిన సినిమాలను చూస్తే మనకు అర్థమవుతుంది.అలాగే హాలీవుడ్ సినిమాని కూడా తెలుగులో తియ్యగలిగే ఏకైక టెక్నీషియన్ రవిబాబుకి మంచి పేరు.ఆయన తీసిన అనసూయ సినిమా హాలీవుడ్ సినిమాలకి ఏమీ తక్కువ కాదు.
ఆ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ చాలా భయంకరంగా అనిపిస్తుంది.నెక్స్ట్ ఏం జరగబోతుంది అని క్యూరియస్ గా అనిపిస్తుంది.
ఆ సినిమాకి ఎంచుకున్న కథ కూడా చాలా మంచి కథ.గులాబీ గోవిందగా రవిబాబు నటన కూడా ఎంతో అద్భుతం అని చెప్పాలి.
భూమిక ఈ కథను నటించడానికి ఎంచుకున్నప్పుడే సినిమాకి సగం విజయం వచ్చింది.ఇక టేకింగ్ కూడా బాగా కుదరడంతో సినిమా విజయం సాధించింది.క్లైమాక్స్, బ్యాక్ డ్రాప్ కథ, గులాబీ గోవింద్ ఎపిసోడ్ మరియు ఫైనల్లీ రవి బాబు లుక్ అన్ని ఎంతో బాగుంటాయి.ఈ మధ్య హార్రర్, సస్పెన్స్ తరహా సినిమాలకు ట్రెండ్ నడుస్తోంది.
ఇప్పుడు కనక ఈ చిత్రం వచ్చి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది.ఇక 2007 లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించడం తో ఈ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ కి స్పెషల్ జ్యూరీ నంది అవార్డ్ కూడా లభించింది.