మలబద్ధకంతో( Constipated ) బాగా ఇబ్బంది పడుతున్నారా.? ఈ సమస్యను వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే అస్సలు చింతించకండి.వయస్సు, ప్రెగ్నెన్సీ, హార్మోన్లలో మార్పులు, తగినంత ఫైబర్ ఆహారాలు( Fiber foods ) తినకపోవడం, కొన్ని రకాల మందుల వాడకం తదితర అంశాలు మలబద్ధకం తలెత్తడానికి కారణం అవుతుంటాయి.
మలబద్ధకం కారణంగా ఆకలి మందగిస్తుంది.ఒంట్లో సర్వ రోగాలు పురుడు పోసుకుంటాయి.కాబట్టి మలబద్ధకం సమస్యను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
ఇకపోతే ఎటువంటి మందులతో పని లేకుండా సహజంగా మలబద్ధకం సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.మరి ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? ఏ విధంగా వాడాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు స్పూన్లు సోంపు గింజలు( Anise seeds ) వేసుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు, ఐదు నుంచి ఆరు యాలకులు(Cardamom ), ఎనిమిది మిరియాలు( Pepper ), హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర( cumin ), పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ మరియు రెండు టేబుల్ స్పూన్లు పటిక బెల్లం పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడిని వేసి బాగా మిక్స్ చేసి నేరుగా సేవించాలి.ఈ పొడి ప్రేగు కదలికను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
ప్రేగుల ద్వారా మలాన్ని బయటకు పంపుతుంది.మలబద్ధకం సమస్యను తరిమి తరిమి కొడుతుంది.
జీర్ణక్రియను చురుగ్గా మారుస్తుంది.కాబట్టి మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన పొడిని తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.