డెలివరీ తర్వాత జుట్టు అధికంగా రాలిపోతుందా.. అయితే ఇదే బెస్ట్ సొల్యూషన్!

డెలివరీ అనంతరం మహిళల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక హెయిర్ ఫాల్( hair fall ) ఒకటి.పోషకాల కొరత, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, హార్మోన్ ఛేంజ్ తదితర కారణాల వల్ల జుట్టు అనేది హెవీగా రాలిపోతూ ఉంటుంది.

 This Home Remedy Helps To Stop Hair Fall After Delivery! Hair Fall, Stop Hair Fa-TeluguStop.com

దాంతో కురులు పల్చగా మారిపోతుంటాయి.అలాంటి సమయంలో ఏం చేయాలి తెలియక.? ఎలా జుట్టు రాలడాన్ని అడ్డుకోవాలో అర్థం కాక సతమతం అవుతుంటారు.కానీ వర్రీ వద్దు.

ప్రసవం అనంతరం హెయిర్ ఫాల్ ను అడ్డుకునేందుకు బెస్ట్ సొల్యూషన్ ఒకటి ఉంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) మరియు ఒక చిన్న కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఒక కలబంద( Aloe vera ) ఆకుని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నైట్ అంతా నానబెట్టుకున్న అవిసె గింజలను వేసుకోవాలి.

Telugu Delivery, Care, Care Tips, Healthy, Remedy, Fall, Remedyhelps-Telugu Heal

అలాగే ఫ్రెష్ అలోవెరా జెల్, ఒక కప్పు హోమ్ మేడ్ కొబ్బరి పాలు( Coconut milk ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ సింపుల్ మాస్క్ ను వేసుకుంటే హెయిర్ ఫాల్ సమస్యకు బై బై చెప్పవచ్చు.

Telugu Delivery, Care, Care Tips, Healthy, Remedy, Fall, Remedyhelps-Telugu Heal

ఈ మాస్క్ జుట్టు రాలడాన్ని చాలా వేగంగా అరికడుతుంది.హెయిర్ రూట్స్ ని బలోపేతం చేస్తుంది.జుట్టుకు చక్కని పోషణ అందిస్తుంది.

ఊడిన జుట్టును మళ్ళీ మొలిపిస్తుంది.కాబట్టి ప్రసవం అనంతరం అధిక హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube