విలక్షణ కథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర.ఆయన వేషధారణ నుంచి మాటలు, చేష్టలు అన్నీ డిఫరెంట్ గానే ఉంటాయి.అంతేకాదు.ఆయనకు సినిమా కథల మీద మంచి పట్టుకుంది.అందుకే ఎవరూ ఊహించని కథలు రాసి తనే దర్శకత్వం వహిస్తాడు కూడా.తను మనసులో అనుకున్నది అనుకున్నట్లుగా తెర మీద చూపించడంలో తనకు తానే సాటి అని చెప్పుకోచ్చు.
ఆయన తీరు చాలా మంది నచ్చితే.కొందరికి మాత్రం అస్సలు నచ్చదు.
అందుకే ఆయనపై పలు విమర్శలు చేసిన సందర్భాలున్నాయి.
కన్నడ నుంచి తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టిన హీరోలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.
వారిలో ఒకడు ఉపేంద్ర.కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి కన్నడతో పాటు తెలుగు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆయన.తన చిత్ర విచిత్రమైన నటన, మాటలతో తెలుగు జనాలను ఆకట్టుకుంటూనే ఉన్నాడు.ఓం, ఎ, రా అనే సినిమాలతో తెలుగు జనాల ముందుకు వచ్చాడు.
అయితే ఈ సినిమాలను ఒక వర్గం వ్యూవర్స్ మాత్రమే చూశారు.మిగతా వాళ్లు ఈ సినిమాలపై విమర్శలు చేశారు.
అయితే ఎవరు అవును అన్నా.కాదు అన్నా.
తనకు నచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు.అయితే కొంత కాలం తర్వాత తన సినిమాలకు జనాల నుంచి ఆదరణ కరువైంది.
అనంతరం తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో మళ్లీ పలకరించాడు.ఈ సినిమాలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు.

నటుడిగానే కాదు.దర్శకుడిగా కూడా ఉపేంద్ర సత్తా చాటుకున్నాడు.పలువురు హీరోలతో సినిమాలను తెరకెక్కించాడు.అయితే ఆయన తీసిన సినిమాల్లో చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకున్న చిత్రాలు తక్కువగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు.అటు తను నటించిన సినిమాల్లో పాటలు కూడా పాడేవాడు.సింగర్ గా కూడా పలు ప్రయోగాలు చేశాడు.
ప్రస్తుతం ఆయన తెలుగులో గని అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఆయన మళ్లీ గత వైభవం చాటుకోవాలని కోరుకుందాం.