మధుమేహం లేదా డయాబెటిస్.పూర్వం ఈ వ్యాధి యాబై, అరవై ఏళ్లు దాటిన వారికే వస్తుందని భావించేవారు.
కానీ, నేటి కాలంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఇలా రకరకాల కారణాల వల్ల పాతిక, ముప్పై ఏళ్లకే మధుమేహం బారిన పడి నానా తిప్పలు పడుతున్నారు.రక్తంలో చెక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటమే మధుమేహం.
ఈ వ్యాధి వచ్చిందంటే.చెక్కెర స్థాయిలను ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలి.
అందుకే మందులు వాడుతుంటారు.
అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తూ కూడా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.
మరి ఆ ఇంటి చిట్కాలు ఏంటో లేట్ చేయకుండా చూసేయండి.మెంతులను డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి.
ఈ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి.ప్రతి రోజు ఉదయాన్నే సేవించాలి.
మధుమేహం ఉన్న వారు ఇలా చేయడం వల్ల.చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
అలాగే మామిడి ఆకులు కూడా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేయగలవు.ఫ్రెష్‌గా ఉండే మామిడి ఆకులు తీసుకుని శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి.అందులో శుభ్రం చేసుకున్న మామిడి ఆకులను క్రష్ చేసి వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.ఈ వాటర్‌ను ఉదయాన్నే వడబోసి మధుమేహం వ్యాధి ఉన్న వారు సేవించాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఉసిరి కాయ, పసుపు కాంబినేషన్ కూడా చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయగలదు.ముందుగా కొన్ని ఉసిరి కాయను శుభ్రం చేసుకుని పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో చిటికెడు పసుపు కలిపి ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.ఎప్పుడూ బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.