ప్రస్తుత రోజులలో చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అని ఎటువంటి తేడా లేకుండా సమాజంలో ఎవరికి సేఫ్టీ లేకుండా అయిపోయింది.ఈ క్రమంలో చిన్నపిల్లలకు విద్యా బోధనలను తెలియచేసే పాఠశాలను( School ) కొంత మంది అసాంఘిక కార్యకలాపాలకి అడ్డగా మారుస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.
పాఠశాలలోనే మద్యం తాగుతూ, బార్ లో డాన్స్ వేస్తున్నటు చేసారు కొందరు.ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలోని( Bihar ) సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
అయితే, వాస్తవానికి పెళ్లి వేడుకల తరుణంలో కొంత మంది వ్యక్తులు బ్యాండ్, నలుగురు బార్ డాన్స్ అమ్మాయిలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు( Govt Primary School ) తీసుకొని వచ్చి తాగి చిందులు వేయడం అక్కడి స్థానికులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్కూల్లో ఇలాంటి పనులు ఏమిటా అంటూ విద్యాశాఖ ఎలా పర్మిషన్ ఇచ్చిందా అంటూ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే పెళ్లి భరత్‌లో భాగంగా కొందరు స్కూల్లో అక్కడే ఉండి వినోదం కోసం ఇలా చేసినట్లు అక్కడ అధికారులు చెప్పుకొస్తున్నారు.
ఇక ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్చార్జి మమతా కుమారి మాట్లాడుతూ.ఇలాంటి ఏ కార్యక్రమానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వరని.ఈ వైరల్ వీడియో( Viral Video ) వారి దృష్టికి వచ్చిందని దానిపై తదుపరి విచారణ తీసుకుంటామని తెలియజేశారు.చూడాలి మరి చివరికి ఏమి అవుతుందో.ఇక ఈ వీడియో చుసిన కొంత మంది వీరికి అసలు బుద్ది ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు.