టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికి తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇప్పుడు అదే ఊపుతో కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఇటీవల పార్ట్ 1 విడుదలై సందడి చేసిన విషయం తెలిసిందే.ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకున్నారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది.
ఇప్పుడు మరిన్ని కలెక్షన్ లను సాధిస్తూ దూసుకుపోతోంది.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.దేవర మూవీ పూర్తయిన తర్వాత వార్2 సెట్స్( War 2 ) కి వెళ్ళారు ఎన్టీఆర్.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానున్న వార్2 చిత్రం ఇదే పేరుతో హిందీలో రిలీజ్ అవుతోంది.అయితే తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి టైటిల్‌ని మార్చి యుద్ధభూమి అనే టైటిల్ ని యాడ్ చేస్తున్నారు.
మెయిన్ టైటిల్ వార్2 ఉంటూనే యుద్ధభూమి అనే టైటిల్‌ను ట్యాగ్ గా పెడుతున్నారని సమాచారం.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ద్వారా ఎన్టీఆర్ లోని నట విశ్వరూపాన్ని చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు వార్ 2 సినిమాలో మరోసారి ఆ అనుభూతిని పొందబోతున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించే పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.కాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ భారీ స్పై థ్రిల్లర్ వచ్చే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ కాబోతోంది.1988లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సినిమాకి యుద్ధభూమి అనే టైటిల్ ( Yudda Bhoomi)ని పెట్టిన విషయం తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.దాదాపు 36 సంవత్సరాల తర్వాత అదే టైటిల్ ని ఎన్టీఆర్ సినిమాకి ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది.