ఆహారం తీసుకునే సమయంలో నీరు తాగవచ్చా.. పరిశోధనలో తెలిసిందేంటంటే..!

ఆహారంతో పాటు నీరు( Water ) తాగడం తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.ఎందుకంటే కొంతమంది నీరు తాగకుండా ఆహారాన్ని తినలేరు.

 Can You Drink Water While Eating , Drink Water , Digestion, Acid, Enzymes , He-TeluguStop.com

కొంతమంది భోజనాల మధ్య ఒకటి లేదా రెండు గుటకల నీరు కచ్చితంగా తాగుతారు.అయితే ఇలా తాగడం వల్ల ఎటువంటి హాని ఉండదు.

అయితే భోజనాల మధ్య ఎక్కువ నీరు తాగడం అస్సలు మంచిది కాదు.నీరు ఆహారం జీర్ణం కావడానికి సహాయపడినప్పటికీ ఆహారం తినే సమయంలో నీరు త్రాగడం వ్యతిరేక ప్రభవాన్ని కలిగిస్తుంది.

ఎందుకంటే ఆహారం తీసుకునేటప్పుడు నీరు వంటి ద్రవాలను తీసుకుంటే జీర్ణక్రియపై చాలా చెడు ప్రభావం చూపుతుంది.దీని వలన మీరు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం తీసుకున్న 30 నిమిషాల ముందు లేదా 30 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీరు త్రాగాలి.ఇలా చేస్తే జీర్ణక్రియ ( digestion )సమయంలో కడుపులో ఉండే ఆసిడ్ మనం తినే ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.

కానీ ఆహారంతో పాటు నీరు తాగితే మాత్రం అది మీ కడుపులోని ఆసిడ్( acid ) ను పొల్యూషన్ చేస్తుంది.దీని వలన జీవ క్రియపై చెడు ప్రభావం పడుతుంది.ఇక ఆహారం కడుపులో ఆమ్లం, ఎంజైములతో చాలా తక్కువ సమయం పాటు సంబంధం కలిగి ఉంటుంది.అందుకే ఆహారంతో నీరు త్రాగడం జీర్ణక్రియ పై చెడు ప్రభావం పడుతుంది.

ఆహారంతో కూడిన నీరు జీర్ణ క్రియపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది.అందుకే తినే సమయంలో నీరు త్రాగడం మంచిది కాదు.

ఇక తినే సమయంలో నీరు త్రాగటం జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు తెలియజేశాయి.ఇలా చాలామంది తినే సమయంలో నీరు తాగడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుందని తెలిసింది.అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగకూడదు.ఇక ఇలా తినే సమయంలో నీటిని తాగితే బరువు కూడా పెరుగుతుంది.ఎందుకంటే మీ శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచడానికి ఇది దారితీస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube