ఈ మధ్యకాలంలో చాలా మంది యువత తమ అందం పై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు.అందువల్లే ఈ మధ్య కాలంలో బ్యూటీ పార్లర్ ల సంఖ్య బాగా పెరిగిపోయింది.
ముఖ్యంగా చెప్పాలంటే యువతులు వారి అందం పై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు.అందాన్ని పెంచుకోవడానికి చాలా మంది యువతులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
వారి కన్నుల అందాల దగ్గర నుంచి ముఖంలోని ప్రతి భాగం అందంగా ఉండాలని వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఎంతమందిలో ఉన్నా వారు ప్రత్యేకంగా కనిపించాలని యువతులు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు.
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది యువతులు తమ బుగ్గలు బూరెల్ల అందంగా ఉండాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా కొంత మంది యువతుల బుగ్గలు అందంగా కనిపించవు.
ఎందుకంటే కొంతమంది యువతులు సరైన సమయానికి ఆహారం తీసుకోకుండా, నీరసంగా బక్క పల్చగా ఉంటారు.దీని వల్ల ముఖం నీరసపడి ముఖంలో కాంతి లేకుండా కనిపిస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే బుగ్గలు అందంగా కనిపించాలంటే సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి.ఇక బుగ్గలు పెరిగేందుకు అని ప్రత్యేక ఆహారం ఏమీ ఉండదు.కానీ ముఖం కళగా కనిపించడానికి కొన్ని చిట్కాలను పాటించాలి.విభిన్న రకాల తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది.నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలు తాగాలి.శరీరంలో నీటి స్థాయి తగ్గకుండా చూసుకోవడం ఎంతో మంచిది.

అప్పుడే చర్మం తాజాగా మరియు అందంగా కనిపిస్తుంది.అందుకోసం నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.షుగర్ లేని తాజా పండ్ల రసాలు ప్రతి రోజు తీసుకుంటూ ఉండడం మంచిది.అవిసే గింజలు, బాదం ఎక్కువగా తీసుకోవాలి.వీటి వల్ల మొహం కాంతివంతంగా కనిపిస్తుంది.చివరిగా ఒత్తిడి తగ్గించుకునేందుకు ధ్యానం చేయాలి.
ప్రతి రోజు ధ్యానం చేయడం వల్ల ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.







