రాజమౌళి.తెలుగు సినిమాను ప్రపంచం నలుమూలల పరిచయం చేసిన వ్యక్తి.
బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలతో సినిమా రేంజ్ ని కూడా వందల కోట్ల నుంచి వేల కోట్లకు పరుగులు పెట్టించారు.అయితే రాజమౌళి క్రియేటివ్ బ్రెయిన్ ఎంత పని చేసిన ఒక పని చేసే ముందు అయన చాల భయపడతారట.
కానీ రమ గారు అందుకు పూర్తిగా వ్యతిరేఖం.ఆమె చాల దైర్యంగా నమ్మిన విలువల కోసం ఎంతైనా కష్టపడతారు.
అలాంటి రమ గారితో రాజమౌళి కలిశారు కాబట్టే ఈ రోజు ఇన్ని వందల కోట్ల ప్రాజెక్ట్స్ బయటకు రాగలుగుతున్నాయి.
ఇక రాజమౌళి జీవితం రమ గారి స్థానం అలా ఒక ముఖ్యమైన భాగం.ఈ విషయాన్నీ రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో పంచుకోవడం తో చాల మందికి తెలిసింది.అయితే రాజమౌలి జీవితంలో ముగ్గరు ఆడవాళ్ళ ప్రభావం బాగా ఉంటుంది అట.ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి రాజమౌళి గారి తల్లి. ఆమె చెప్పిన మాటలు, పెంచిన పెంపకం వంటి వాటి వల్లనే ఈ రోజు రాజమౌళి అనే ఒక దర్శకుడు పుట్టాడు.
ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు రమ గారి ప్రభావం విపరీతంగా ఉంటుంది.ఆమె చెప్పిన ఏ పని అయినా కూడా రాజమౌళి ఒకటికి రెండు సార్లు వింటారట.ఇక మూడో వ్యతి మయూఖ.రాజమౌళి కూతురు అయినా మయూఖ తన తండ్రిని చిటికిన వేలి మీద ఆడిస్తుందట.అంతగా రాజమౌళి కూతురి ప్రేమలో మునిగిపోతారట.
ఇక ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే రాజమౌళిని ఈ ముగ్గురు ఆడవాళ్లు మాత్రమే కొట్టగలరట.చిన్నతనంలో నుంచి ఆమె చనిపోయే వరకు ఒక పది సార్లు రాజమౌళి ని వాళ్ళ అమ్మ గారు మందలించి కొట్టారట, ఇక రమ గారు కూడా ఒక సమయంలో రాజమౌళి పై చెయ్యి చేసుకున్నారట.మరి ముఖ్యంగా మయూఖ తండ్రి రాజమౌళి తో ఎక్కువగా బంధం కలిగి ఉండటం వాళ్ళ ఎక్కి తొక్కేయ్యగల సాన్నిహిత్యం ఉంటుందట.
అందుకే తన జీవితంలో తనను ఇప్పటి వరకు కొట్టింది కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే.వాళ్ళు తన తల్లి, తన భార్య మరియు తన కూతురు అని రాజమౌళి తెలిపారు.