చాలామందికి టీ ( tea )తాగే అలవాటు కచ్చితంగా ఉంటుంది.టీ తాగడం వలన వారికి రిలాక్సేషన్ అందుతుంది.
అందుకు చాలామంది టీ, కాఫీ ను తాగేందుకు ఇష్టపడతారు.అయితే టీ లో కొన్ని ఆకులను చేర్చడం వలన అనేక సమస్యల నుండి బయటపడవచ్చు.
అయితే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉన్న ఈ ఆకులతో టీ తయారు చేసుకొని తాగితే ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది.అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఈ ఆకుల్లో ఉంది.
అంతేకాకుండా ఫ్లూ, సీజనల్ వ్యాధుల నుంచి కూడా నివారించవచ్చు.ఇక ఈ ఆకులు రోగనిరోధక శక్తి పెంచడం మాత్రమే కాకుండా శ్వాసకోస సమస్యలు నివారించడంలో కూడా సహాయపడతాయి.
తులసి( basil ) ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.ఈ ఆకులను టీలో కలిపి తాగితే దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల( Cough, cold, lung related problems ) నుండి బయటపడవచ్చు.అంతేకాకుండా కఫంతో కూడిన దగ్గుల ఊపిరితిత్తులకు ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా శ్లేష్మాన్ని విచ్చినం చేయడంలో అలాగే దాన్ని బయటికి పంపడంలో కూడా ఇది సహాయపడుతుంది.అయితే తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టాలి.ఇక టీలో కొద్దిగా తేనె, నిమ్మరసం( Honey and lemon juice ) కలుపుకొని తాగాలి.
పొడి దగ్గు ఉన్నవారు లవంగాలను కూడా జోడించవచ్చు.పుదీనా ఆకులను టీలో జోడించడం కూడా రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది.
ముందుగా పుదీనా ఆకులను ఉడకబెట్టాలి.ఆ తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేయాలి.ఇక దాంట్లో తేనెను మిక్స్ చేసి తాగాలి.ఇలా తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.అంతేకాకుండా ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది.అంతేకాకుండా న్యుమోనియా, బ్రౌన్కైటిస్, పొడి దగ్గు లాంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
ఈ రెండు ఆకులు కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడతాయి.ఈ రెండిటిలో కూడా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి.
ఇవి ఎలాంటి సమస్యలైనా దూరం చేస్తాయి.