ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడం మాములే.గొడవ తర్వాత ఎవరైనా వచ్చి క్షమాపణ చెబితే కుటుంబం సాధారణ స్థితికి వస్తుంది.
అయితే ఈ గొడవలలో పిల్లలు వాగ్వాదాలకు దిగకూడదని నిపుణులు అంటున్నారు.అయితే అలాంటి ఘటనే చైనాలో( China ) తాజాగా చోటుచేసుకుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అయిన వీడియో చూస్తుంటే.
ఆ మహిళ భర్తతో గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ గొడవలో, ఆ మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలను వారి 23వ అంతస్తులోని అపార్ట్మెంట్( Apartment ) వెలుపల ఎయిర్ కండీషనర్‌పై ప్రమాదకరంగా కూర్చోబెట్టింది.
దాంతో భయపడిన పిల్లలు( Kids ) ఏడవడం ప్రారంభించారు.అలా ఆ పిల్లల కూర్చబెట్టిన వారికీ ఎటువంటి రక్షణ లేదు.కానీ, భర్త ( Husband ) పిల్లలను సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, అతడిని దెగ్గరకు రానివ్వకుండా అడ్డుపడింది.దీంతో పిల్లలు ఏడవడంతో పాటు కేకలు ఎక్కువయ్యాయి.ఈ క్రమంలో ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా అసలు విషయం అర్థమైంది.వీడియో రికార్డ్ చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
అదే సమయంలో, ఆందోళన చెందిన అక్కడ ఓ వ్యక్తి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చిన్నారులను రక్షించారు.ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అయితే, ఆ మహిళలకు శిక్ష పడుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.అంతే కాకుండా వివాహ వివాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఇక వీడియో చుసిన సోషల్ మీడియా ఫాలోయర్స్ మహిళపై పెద్దెతున్న మంది పడుతున్నారు.