స్టార్ హీరో బాలకృష్ణ ( Balakrishna )అన్ స్టాపబుల్ షోను ఏ రేంజ్ లో సక్సెస్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
అయితే బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో( Rana Talk Show ) ప్రసారం కానుందని తెలుస్తోంది.అమెజాన్ ప్రైమ్ లో ఈ టాక్ షో( Amazon Prime ) ప్రసారం కానుందని సమాచారం అందుతోంది.
ఈ ప్రముఖ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కు రామ్ గోపాల్ వర్మ ,రాజమౌళి( Ram Gopal Varma, Rajamouli ) గెస్టులుగా హాజరవుతారని సెకండ్ ఎపిసోడ్ కు చైతన్య, శోభిత గెస్టులుగా హాజరు కానున్నారని సమాచారం అందుతోంది.అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ గెస్టుల విషయంలో రాజీ పడే అవకాశం కూడా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రానాకు గతంలోనే టాక్ షోలకు హోస్ట్ గా పని చేసిన అనుభవం ఉందనే సంగతి తెలిసిందే.
రానా ఈ షో భారీ మొత్తం పారితోషికంగా అందుకుంటున్నారని తెలుస్తోంది.ఈ షోతో రానా క్రేజ్ ఎన్నో రెట్లు పెరగడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రానా ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు షోకు హోస్ట్ గా వ్యవహరించడం ద్వారా ప్రశంసలు అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే.
రానాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
రానా హీరోగా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించి ప్రశంసలు అందుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.రానా ఒకే తరహా లుక్ లో కనిపిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.వేట్టయన్ సినిమాలో రానా నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
రానాకు బాహుబలి సిరీస్ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టిన స్థాయిలో ఇతర సినిమాలు అయితే తెచ్చిపెట్టలేదనే సంగతి తెలిసిందే.రానా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమమవుతున్నాయి.
రానా తన టాలెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.