స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.మూడేళ్ల క్రితం ప్రభాస్ ప్రకటించిన సినిమాలలో స్పిరిట్ ఒకటి.
వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతోంది.అయితే తన డైరెక్షన్ లో నటించే సమయంలో తన సినిమాలో మాత్రమే నటించాలని సందీప్ రెడ్డి వంగా షరతు విధించారని భోగట్టా.
ప్రభాస్ ది రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలను పూర్తి చేసి స్పిరిట్ సినిమాతో బిజీ కానున్నారు.

మరో నాలుగైదు నెలల తర్వాత స్పిరిట్ సినిమా( Spirit movie ) షూటింగ్ లో ప్రభాస్ పాల్గొననున్నారు.సాధారణంగా జక్కన్న మాత్రమే ఇండస్ట్రీలో ఇలాంటి షరతులు విధిస్తారు.సందీప్ రెడ్డి వంగా కూడా అలాంటి షరతు విధించడంతో సందీపి జక్కన్నను మించిన ట్విస్ట్ ఇచ్చాడుగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా తన సినిమాలో ప్రభాస్ ను భిన్నమైన లుక్స్ లో చూపించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ షరతు విధించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.వైరల్ అవుతున్న వార్తల గురించి సందీప్ రెడ్డి వంగా నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.సందీప్ రెడ్డి వంగా సినిమాలకు తన కుటుంబ సభ్యులు సహ నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.సందీప్ రెడ్డి వంగా కెరీర్ పరంగా సినిమా సినిమాకు ఎదుగుతున్నారు.
టాలీవుడ్ టాప్ హీరోలంతా సందీప్ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నటిస్తే కెరీర్ మలుపు తిరగడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.సందీప్ రెడ్డి వంగా స్క్రిప్ట్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నా సినిమాలను మాత్రం వేగంగా షూట్ చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.







