తెలుగు సినిమా ప్రేక్షకులకు నటి రేణు దేశాయ్( Actress Renu Desai ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
తరచూ తనుకు తన పిల్లలకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.అదేవిధంగా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో జరిగే పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలో తన పై ట్రోలింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది.

ఇకపోతే నటి రేణు దేశాయ్ కి దైవభక్తి ఎక్కువే అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆచార సంప్రదాయాలకు( ritual traditions ) ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.ఇటీవల తన నివాసంలో భక్తి శ్రద్ధలతో చండీ హోమం( Chandi Homa ) నిర్వహించారు.
శరద్ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమంలో ఆమె తనయుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నారూ.దీనికి సంబంధించిన ఒక వీడియోను తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.
అలాగే ఆ పోస్ట్ లో ఆమె ఈ విధంగా రాసుకొచ్చారు.శరద్ పూర్ణిమ ( Sharad Purnima )సందర్భంగా గణపతి, చండీ హోమం నిర్వహించాము.
మన సంస్కృతిలో శరద్ పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

తల్లిదండ్రులుగా మన ఆచారాల ప్రాముఖ్యతను, పూర్వీకులు అనుసరించిన సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలి అని రాసుకొచ్చారు రేణు దేశాయ్.అంతేకాకుండా పూజలు చేసే సమయంలో ఆర్భాటాలకు పోవద్దని ప్రశాంతతో భక్తిపైనే దృష్టి పెట్టాలని తెలిపారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే రేణు దేశాయ్ ఇటీవల కాలంలో వరుసగా చిన్నచిన్నగా సినిమాలలో మళ్లీ నటిస్తున్న విషయం తెలిసిందే.అడపాదడపా సినిమాలలో నటిస్తోంది రేణు దేశాయ్.







