1.మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి : సీతక్క

గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
2.కేసీఆర్ కు ఈటెల సవాల్
తెలంగాణ కు మద్యం ద్వారా ఏడాదికి వచ్చే ఆదాయం 45 వేల కోట్లని,కానీ ఆ ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు పెద్దగా ఖర్చు చేయడం లేదని, దీనిపై దమ్ముంటే కేసీఆర్ తనతో చర్చకు రావాలని బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సవాల్ చేశారు.
3.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై హైకోర్టులో పిటిషన్

బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.భూమి విషయమై బెదిరింపుకు పాల్పడిన ఘటనపై గాంధీపై సులోచన అగర్వాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
4.కవితపై ఎంపి అరవింద్ విమర్శలు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం స్కాములు తప్ప, ఏమి చేయరని, కాలేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కు వచ్చిన 10 వేల కోట్ల ను ఆయన కూతురు , ఎమ్మెల్సి కవితకు ఇచ్చారని , వాటిని తీసుకువెళ్లి ఢిల్లీ లిక్కర్ లో కవిత పెట్టుబడులు పెట్టారని అరవింద్ విమర్శించారు.
5.పొంగులేటి కి ఎమ్మెల్యే వీరయ్య సవాల్

కేసీఆర్ నన్ను సత్తుపల్లి అభ్యర్ధిగా ప్రకటించారు.నీకు నీ అభ్యర్దిని ప్రకటించే దమ్ముందా అని ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య సవాల్ చేశారు.
6.విజయవాడలో ఎస్ఎఫ్ఐ నిరసన దీక్ష
విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోరుతూ విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎనిమిది గంటల నిరసన దీక్ష మొదలుపెట్టింది.
7.ఎంపీ అరవింద్ కు సోషల్ మీడియా బాధ్యతలు

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బి ఆర్ ఎస్ ప్రభుత్వంను ఎదుర్కొనేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని బిజెపి నాయకత్వం నిర్ణయించింది.
8.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడింది.మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి.అతి భారీ వర్షాలు కురువనున్నాయి.
9.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు టోకెన్ రహిత శ్రీవారి సర్వదర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
10.సీబీఎస్ఈ లో తెలుగు మీడియం
సీబీఎస్ఈ సిలబస్ పాఠశాలల్లో ఇకపై తెలుగు తో పాటు రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో రూపొందించిన 21 భాషలను చేర్చుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
11.మణిపూర్ సీఎం ను బర్తరఫ్ చేయాలి

మణుగూరు సీఎం బీరేన్ సింగ్ ను భర్తరఫ్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.
12.బీజేపీ ధర్నాకు హైకోర్టు అనుమతి
బిజెపి మహాధర్నకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది.రేపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చని న్యాయ స్థానం తెలిసింది.
13.పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసు

విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం పిటిషన్ దాఖలయ్యింది.ఈ పిటిషన్ ను ఓ వాలంటీర్ దాఖలు చేశారు .న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.
14.పవన్ సిపిఐ నారాయణ విమర్శలు
పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, మునిగిన పడవపై ప్రయాణం చేస్తున్నారని, మేము ఈ ఇద్దరికీ సపోర్ట్ చేయమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
15.సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ కి ఎంపీ అవినాష్ లేఖ

వైయస్ వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు లేఖ రాశారు.గతంలో వివేక హత్య కేసును విచారించిన ఎస్పి రామ్ సింగ్ పై ఆయన ఫిర్యాదు చేశారు.
16.ఎమ్మెల్యే ఆర్కే విమర్శలు
పేదల ఇళ్ల నిర్మాణాలను టీడీపీ అడ్డుకుంటుందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
17.కేంద్రం పై హరీష్ రావు ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం పై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఢిల్లీలో ఉన్న బిజెపి ప్రభుత్వంను గద్దె దించుతామని హెచ్చరించారు.
18.అమిత్ షా తో బండి సంజయ్ భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు.
19.కేసీఆర్ కు రేవంత్ సవాల్

ప్రజలకు నమ్మకం ఉంటే గజ్వేల్ లో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 55,150
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 60,160
.






