తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణవంశీ( Krishna Vamshi ) దర్శకత్వం అంటే ఒక సపరేటు ఫ్యాన్ బేస్ ఉంటుంది.2002లో ఆయన తీసిన ఖడ్గం సినిమా( Khadgam Movie ) ప్రస్తుతం రిలీజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్ అందుకే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి అలాగే కృష్ణవంశీ దర్శకత్వం గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు కనిపిస్తున్నాయి. 22 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఏంటి అంటే అద్భుతమైన సినిమా అని.దీన్ని బట్టి ఇప్పటి దర్శకుడు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఈ సినిమా ఒకటి ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు.
శ్రీకాంత్( Srikanth ) రవితేజ( Ravi Teja ) ప్రకాష్ రాజ్( Prakash Raj ) ప్రధాన పాత్రలతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా దేశభక్తిని పెంపొందించే విధంగా ఉంది.ఇక ఈ సినిమాలో నటీనటుల నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ప్రతి ఒక్కరూ తమ పాత్ర మీదకు ఎంతో అద్భుతంగా నటించే సినిమా విజయంలో కీలకమైన పాత్ర పోషించారు.ఇక వసూళ్లపరంగా కూడా ఇది ఒక కమర్షియల్ సక్సెస్ అందుకుంది.
ఇప్పుడు మరోసారి విడుదలవుతున్న సందర్భంగా ఈ చిత్రానికి వస్తున్న బజ్ మామూలుగా లేదు.ఇందులోని పాటలు కూడా చాలా బాగుంటాయి.
ఇన్నేళ్ల తర్వాత కూడా అందరి నోళ్ళల్లో ఇవే పాటలు నానుతూ ఉంటాయి.
ఇక ఈ సినిమాలో నటించిన నటుడు షఫీ( Actor Shafi ) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.అప్పట్లో అతడి నటన చూసిన వారంతా కూడా నిజంగానే పాకిస్తాన్ నుంచి నటుడుని పట్టుకొచ్చి ఈ సినిమాలో నటింప చేశారు అనే భ్రమలో ఉండేవారు.అంతలా తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.
అయితే ఎందుకో గాని ఆ తర్వాత ఆ స్థాయిలో షఫీ మళ్ళీ కనిపించలేదు.అంత అద్భుతమైన పాత్ర నటించడం షఫీకి మంచి పాత్రలు రావాలని అందరూ అనుకున్నారు కానీ ఎందుకో అది జరగలేదు అని అనిపిస్తుంది.