బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్8( Bigg Boss 8 ) కు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హౌస్ లోకి ఎక్కువ సంఖ్యలో కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.
నాగార్జున( Nagarjuna ) హోస్టింగ్ కూడా రొటీన్ అవుతోందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.
బిగ్ బాస్ హౌస్ నుంచి నాగ మణికంఠ( Naga Manikanta ) ఎలిమినేట్ అయ్యాడని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.పృథ్వీ( Prithvi ) బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
ఈ వారం నాగ మణికంఠ సరిగ్గా ఆడకపోవడంతో ఊహించని ట్విస్ట్ చేసుకుందని సమాచారం అందుతోంది.ఫిజికల్ టాస్క్ లో ఆడకపోవడం నాగ మణికంఠకు మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగ మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడం ఈ షోకు ప్లస్ అవుతుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.బిగ్ బాస్ టీం తీసుకున్న నిర్ణయం వల్లే నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యారని బిగ్ బాస్ షో రివ్యూవర్లు అభిప్రాయపడుతున్నారు.మణికంఠ షో విషయంలో తప్పులు చేస్తున్నారని భావించి అతనిని ఎలిమినేట్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఓటింగ్ ప్రకారం పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి కానీ ఊహించని ట్విస్టులు చోటు చేసుకోవడం బిగ్ బాస్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ సీజన్8 విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ దారుణంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మొదట పృథ్వీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు ప్రచారం జరగగా షూటింగ్ పూర్తైన తర్వాత మాత్రం అసలు క్లారిటీ వచ్చింది.నాగ మణికంఠ ఎలిమినేషన్ తో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.







