ఏపీ నుంచి రాజ్యసభకు( Rajyasabha ) ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై టిడిపి, జనసేన ,బిజెపి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.వైసిపి నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో , వారి స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే ముగ్గురు సభ్యుల ఎంపిక పైన చంద్రబాబు( CM Chandrababu ) ప్రతిపాదనలు సిద్ధం చేశారట.జనసేన అధినేత పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) బిజెపి నాయకత్వంతోనూ రాజ్యసభ సభ్యుల ఎంపికపైనా చర్చించినట్లు సమాచారం.
దీనిలో భాగంగానే రెండు టిడిపి , ఒకటి జనసేనకు ఇవ్వాలని చంద్రబాబు భావించినా, మూడు పార్టీలకు ఒక్కో సీటు ఖరారు చేసే దిశగా నిర్ణయించుకున్నట్లు సమాచారం .ఇక అభ్యర్థుల ఎంపికైన పూర్తిగా చంద్రబాబు దృష్టి సారించారట.వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. వీరిలో మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ టిడిపిలో చేరారు .తిరిగి మస్తాన్ రావు కు( Mastan Rao ) రాజ్యసభ ఇస్తామనే హామీ కూడా ఇవ్వడంతో , ఈ విషయంలో ఆచితూచి ఎంపిక చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కూటమి పార్టీలకు పూర్తిగా బలం ఉండడంతో , మూడు స్థానాలు వీరికే దక్కుతాయి.దీనిలో భాగంగానే జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) పేరును పరిశీలిస్తున్నారట.అయితే చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగితే తప్ప , దాదాపుగా నాగబాబు పేరు ఖరారు అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక టిడిపి నుంచి చాలామంది రాజ్య సభ్యత్వం పై ఆశలు పెట్టుకున్నారు .వీరిలో నందమూరి సుహాసిని( Nandamuri Suhasini ) పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిడిపి రాజకీయ భవిష్యత్తు, ప్రయోజనాల దృష్ట్యా నందమూరి కుటుంబానికి ప్రాధాన్య దిశగా సుహాసిని పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక పార్టీ సీనియర్ నేతలైన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , కంభంపాటి రామ్మోహన్ రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీమంత్రి యనమాల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

టిడిపి నుంచి ఈసారి బీసీకి అవకాశం ఇస్తారని, కొత్త వారికి కాకుండా తిరిగి మస్తాన్ రావుని టిడిపి నుంచి ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ కీలక నాయకులు కొంతమంది చెబుతున్నారు .అయితే బిజెపికి ఒక స్థానం ఇవ్వాలనే ప్రతిపాదన ఉండడంతో, త్వరలోనే వైసీపీ నుంచి మరొక రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేసి అవకాశం ఉంటుందని , అదే జరిగితే బిజెపికి అవకాశం ఇస్తామని టిడిపి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఈ మూడు స్థానాల్లో ఒకటి బిజెపికి ఇవ్వాలని తాజాగా చర్చ జరిగిన నేపథ్యంలో , మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సీటు ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది.అయితే టిడిపి నుంచి ఎక్కువమంది రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తూ ఉండడంతో ఈ ఎంపికలు చంద్రబాబు కు ఇబ్బందికరంగానే మారిందట.