టాలీవుడ్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ( Anasuya ) ప్రస్తుతం వెండితెరపై సినిమా అవకాశాలను అందుకొని సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈమెకు వరుసగా అవకాశాలు రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.
అనసూయ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమెకు వరుసగా సినిమాలలో అవకాశాలు రావడమే కాకుండా ఏదైనా షాపింగ్ మాల్స్(Shopping Mall) ప్రారంభం చేయాలి అంటే కూడా అందరికీ మొదటి ఆప్షన్ గా మారుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదైనా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటే అక్కడ తప్పనిసరిగా అనసూయ ఉంటుంది.తాజాగా అన్నమయ్య జిల్లా రాయచోటి(Rayachoti) లో జరిగినటువంటి ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనసూయ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పాల్గొనబోతున్నారనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు.అనసూయ ఎక్కడ ఉన్న కెమెరాలన్నీ కూడా తనపైనే దృష్టి పడేలా అటెన్షన్ తో ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈమె ఎప్పటికప్పుడు మోడరన్ డ్రెస్సులను ధరిస్తూ పెద్ద ఎత్తున అందరిని సందడి చేస్తుంటారు.కేవలం మోడ్రన్ డ్రెస్ మాత్రమే కాకుండా చీర కట్టిన( Saree ) కూడా ఇతరుల చూపు పక్కకు తిప్పుకోలేరనే విషయం మనకు తెలిసిందే.ఇక రాయచోటి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనసూయ కాస్త వింత డ్రెస్ ధరించింది.చీర కట్టుకున్నప్పటికీ బ్లౌజ్ మాత్రం కాస్త డిఫరెంట్ స్టైల్లో కుట్టించడంతో ఈ బ్లౌజ్ కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.
మాటిమాటికి తన బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకుంటూ అనసూయ ఈ డ్రెస్సులో కాస్త ఇబ్బంది పడిందనే చెప్పాలి.ఇక కెమెరాలన్నీ కూడా ఆమెను ఫోకస్ చేయడంతో కాస్త అసౌకర్యంగా ఫీల్ అయింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో పలువురు స్పందిస్తూ ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం ఎందుకు అంత ఇబ్బంది పడటం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.