పైపెదవిపై జుట్టు తొలగించటానికి అనేక సహజసిద్ధమైన పదార్ధాలు ఉన్నాయి.వాక్సింగ్, త్రేడింగ్ వంటి పద్దతులను ఉపయోగిస్తే కొంచెం నొప్పి కలగటమే కాకుండా కాస్త అసహ్యంగా కూడా కనిపించే అవకాశం ఉంది.
అందువల్ల ఇప్పుడు మనం సురక్షితమైన,సులువైన,నొప్పి లేకుండా ఉండే సహజసిద్ధమైన పద్దతుల గురించి తెలుసుకుందాం.కోడిగుడ్డు తెల్లసొనను పై పెదవిపై పొరల వేయాలి.15 నిముషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ పంచదార కలిపి పై పెదవిపై రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత రోజ్ వాటర్ ని రాయాలి.
వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఒక స్పూన్ బంగాళా దుంప రసంలో అరస్పూన్ మైదా పిండిని కలిపి జుట్టు ఉన్న పై పెదవిపై రాసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.రెండు స్పూన్ల పాలలో పావు స్పూన్ పసుపు కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేస్తే పైపెదవిపై జుట్టు తొలగిపోతుంది.