50 సంవత్సరాల లోపు వారిలో 79 శాతం పెరిగిన.. ఈ భయంకరమైన వ్యాధి..?

ప్రస్తుత సమాజంలో ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు క్యాన్సర్ ( Cancer )కేసులు పెరిగిపోతున్నాయని ఒక అధ్యయనంలో తెలిసింది.50 సంవత్సరాల లోపు వారిలో కొత్తగా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య 79% పెరిగిందని పరిశోధకులు చెబుతున్నారు.ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది.స్కాట్లాండ్ లోని ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యాయాన్ని నిర్వహించారు.ఇందులో కనుగొన్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1990 నుంచి రొమ్ము, శ్వాసనాళం, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.అలాగే రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు( lungs ), ఉదర క్యాన్సర్ల( Abdominal cancers ) వల్ల మరణాలు అధికంగా నమోదవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

 79 Percent Of Those Under 50 Years Of Age Have Increased This Terrible Disease-TeluguStop.com
Telugu Cancer, Tips, Pressure, Liver Cancer, Lungs, Prostate Cancer-Telugu Healt

అలాగే సంబంధిత మరణాల సంఖ్య సైతం 21 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.40 సంవత్సరాల లో ఉన్నవారికి ఈ ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉంది.అయితే కాలేయ క్యాన్సర్( Liver cancer ) కొత్త కేసుల నమోదు మాత్రం ప్రతి సంవత్సరం 2.88 శాతం తగ్గినట్లు చెబుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా 50 సంవత్సరాల లోపు ఉన్న వారిలో క్యాన్సర్ వల్ల 2019లో 10 లక్షల మందికి పైగా మరణించినట్లు నివేదిక చెబుతోంది.

అలాగే రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధికలు శ్వాసనాళం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.అలాగే కిడ్నీ, అండాశయా క్యాన్సర్ల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది.

Telugu Cancer, Tips, Pressure, Liver Cancer, Lungs, Prostate Cancer-Telugu Healt

కొన్ని దేశాలలో పురుషుల కంటే మహిళలపై క్యాన్సర్ వ్యాధి( Cancer disease ) ప్రమాదం ఎక్కువగా ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే క్యాన్సర్ వ్యాధి భారిన పడడానికి జన్యుపరమైన ( Genetic )అంశాలు ఒక కారణమైతే, వేట మాంసం, ఉప్పు ఎక్కువగా తినడం, పాలు, పండ్లు తక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉంది.అలాగే మద్యపానం, పొగాకు వినియోగం అని పరిశోధకులు( Researchers ) చెబుతున్నారు.అలాగే 50 సంవత్సరాల లోపు వారిలో ప్రధాన క్యాన్సర్ కారకాలు శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు( Overweight ),అధిక రక్తపోటు ( high blood pressure )కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయనీ నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube