నా కొడుకు బొద్దింకకు కూడా హాని తలపెట్టడు.. సల్మాన్ ఖాన్ తండ్రి కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman Khan )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు.

 Salim Khan Says Salman Khan Not Involved In Blackbuck Poaching, Salim Khan, Salm-TeluguStop.com

కేవలం సినిమాల విషయంలో మాత్రమే కాకుండా ఇతర విషయాల విషయంలో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు సల్మాన్ ఖాన్.ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ ( Lawrence Bishnoi )నుంచి తరచూ అతనికి బెదిరింపులు వస్తున్నాయి.

కృష్ణ జింకలను వేటాడాడానే కోపంతో బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది.ఈ విషయంలో బాలీవుడ్ నటుడు క్షమాపణ చెప్పాలని బిష్ణోయ్ గ్యాంగ్ డిమాండ్ చేస్తోంది.

Telugu Blackbuck, Bollywood, Salim Khan, Salimkhan, Salman Khan-Movie

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బిష్ణోయ్ వర్గం కృష్ణ జింకలను( Black Buck ) దేవతలతో సమానంగా ఆరాధిస్తోంది.ఈనేపథ్యంలోనే సల్మాన్ కృష్ణ జింకలను వేటాడడంతో అతనిపై కోపంతో రగిలిపోతున్నాడు లారెన్స్ బిష్ణోయ్.జైల్లో నే ఉంటూ స్టార్ హీరోకు వరుసగా బెదిరింపు సందేశాలు పంపుతున్నాడు.సల్మాన్‌ ఖాన్‌ని వచ్చి తన గుడికి క్షమాపణ చెప్పాలని లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్ ఇటీవల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.అయితే సల్మాన్ కృష్ణ జింకలను కాదు కదా బొద్దింకకు( cockroach ) కూడా హాని చేయలేదంటున్నాడు సల్మాన్ తండ్రి సలీం ఖాన్.

Telugu Blackbuck, Bollywood, Salim Khan, Salimkhan, Salman Khan-Movie

ఈ సందర్భంగా సలీం ఖాన్ మాట్లాడుతూ.సల్మాన్ ఖాన్ నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు.జంతువులను వేటాడటం సల్మాన్‌ కు ఇష్టం ఉండదు.అతనికి జంతువులంటే చాలా ఇష్టం.నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు అని సలీంఖాన్( Salim Khan ) చెప్పుకొచ్చారు.సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలని బిష్ణోయ్ గ్యాంగ్ అంటోంది.

దీనిపై సలీం ఖాన్ మాట్లాడుతూ.క్షమాపణలు చెప్పడం అంటే మేం తప్పును అంగీకరించినట్లే.

సల్మాన్ ఖాన్ ఏ జంతువును చంపలేదు.అతను కనీసం బొద్దింకకు కూడా హాని తలపెట్టలేదు.

సల్మాన్ ఖాన్ ఎవరికి క్షమాపణలు చెప్పాలి? మీరు ఎంత మందికి క్షమాపణలు చెప్పారు? మీరు ఎన్ని జంతువుల ప్రాణాలను కాపాడారు? నా కొడుకు ఏం తప్పు చేసాడు? మీరు కేసు దర్యాప్తు చేశారా? అని సలీం ఖాన్ ప్రశ్నించారు.ఈ సందర్భంగా సలీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube