బార్లీ వాటర్( Barley Water ) అనేది చాలా పోషకాలు, రుచి కలిగిన పదార్థం అని దాదాపు చాలా మందికి తెలుసు.దీన్ని బార్లీ గింజలను నీటిలో ఉడకబెట్టడం వల్ల తయారు చేస్తారు.
ఈ వాటర్ ను ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇస్తారు.దీని వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్కృతులలో ఇది సాంప్రదాయ పానీయంగా చెబుతారు.ముఖ్యంగా చెప్పాలంటే శరీరంలోని వేడిని దూరం చేయడానికి ఈ బార్లీ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ బార్లీ నీరు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బార్లీ వాటర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలలో ముఖ్యంగా ఒక కప్పు బార్లీ గింజలు, నాలుగు నుంచి ఐదు కప్పుల నీరు ఉంటే సరిపోతుంది.అలాగే బార్లీ గింజలను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి.శుభ్రం చేసిన బార్లీ గింజలను ఒక గిన్నెలో వేసి రెండు నుంచి మూడు కప్పుల నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.
ఉదయం లేవగానే నానబెట్టిన బార్లీ గింజలను మరోసారి శుభ్రం చేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి.నానబెట్టిన నీటిని వేరుగా ఉంచాలి.నానబెట్టిన బార్లీ గింజలను జర్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఒక పెద్ద గిన్నెలో రెండు నుంచి మూడు కప్పుల నీటిని మరిగించి మధ్యస్త పాళ్ళ మీద ఉడికించాలి.

ఉడికించిన నీటిలో ముందుగా నానబెట్టిన నీటిని పొడి చేసిన బార్లీ పొడి తో కలపాలి.ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగించి మంటను ఆర్పి వేయాలి.బార్లీ నీరు చల్లబడిన తర్వాత దానిని వడపోయాలి.రుచి కోసం నిమ్మరసం లేదా తేనెను కలుపుకోవాలి.ఈ బార్లీ నీటిని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.అలాగే రక్తపోటుతో పాటు మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది.ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
బార్లీ టాక్సిన్స్‌ను బయటకు పంపి, అధిక బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.