రోజమ్మ నా అమ్మ.. వైరల్ అవుతున్న రాకింగ్ రాకేష్ ఎమోషనల్ కామెంట్స్!

బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్( Jabardast comedian Rocking Rakesh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ లో ఎన్నో స్కిట్ లు చేసి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

 Jabardasth Rakesh About Kiraak Rp Comments On Roja, Jabardasth, Raking Rakesh, K-TeluguStop.com

అంతేకాకుండా తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.ఇక రాకేష్ జోర్దార్ సుజాతను( Jordar Sujatha ) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ కూడా జన్మించింది.ఇకపోతే గత కొద్ది రోజులుగా కిరాక్ ఆర్పి వైఎస్ఆర్సిపి రోజా పై తీవ్రత స్తాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Jabardasth, Kiraak Rp, Rakesh, Roja-Movie

ఈ విషయంలో కొందరు కిరాక్ ఆర్పీ కి మద్దత్తుగా నిలవగా మరికొందరు ఆర్పీ మండి పడ్డారు.అందులో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు.తాజాగా రోజా( Roja ) మీద కిరాక్ ఆర్పీ చేసే అనుచిత వ్యాఖ్యల గురించి జబర్దస్త్ రాకేష్ కౌంటర్లు వేశాడు.రోజాను అమ్మలా భావిస్తుంటాడు రాకేష్.ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా కూడా రోజా గురించి గొప్పగా చెబుతుంటాడు రాకేష్.తాజాగా తన కొత్త చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌లో రాకేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇంటి గడప వరకు రాజకీయాలు.గడవ అవతలి అందరినీ ఒకేలా ప్రేమగా చూసుకుంటుంది.ఆమె నాకు అమ్మలాంటిది.ఎన్నో సందర్భాల్లో నిలిచింది.

Telugu Jabardasth, Kiraak Rp, Rakesh, Roja-Movie

నాకు స్వతంత్ర, అధికారికంగా ఏమైనా అడిగే అంత చనువు ఉంది.నాకు ఎన్నో సార్లు ఆర్థిక పరంగా సాయం చేసింది.కొంత మంది ఆమె ద్వారా లబ్ది పొంది కూడా విమర్శిస్తున్నారు.అది వాళ్ల వ్యక్తిగతం, అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ రాకేష్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా రాకేష్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఆర్పీ ని ఉద్దేశించి అలా కామెంట్స్ చేస్తున్నారు.కాగా రాకేష్ కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) అంటూ మూవీ తీశాడు.

కానీ కేసీఆర్ అధికారంలో లేని టైంలోనే సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది.మరి ఈ కేసీఆర్‌కు, ఆ కేసీఆర్‌కు సినిమాలో ఏదైనా లింక్ ఉంటుందా? పొలిటికల్ టచ్ ఏమైనా ఉంటుందా? అన్నది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube