టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో సాయి రాజేష్( Director Sai Rajesh ) ఒకరు కాగా ఈ దర్శకుడు బేబీ సినిమాతో( Baby Movie ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.కేసీఆర్ మూవీ( KCR Movie ) ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
త్వరలో ఈ సినిమా విడుదల కానుండగా అంజి అనే డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
ఈ ఈవెంట్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
జబర్దస్త్ షో కొరకు నేను, అనసూయ( Anasuya ) కలిసి పని చేశామని ఆ సమయంలో అనసూయతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని సాయి రాజేష్ అన్నారు.ఆ సమయంలో చాలామంది నేను అనసూయ భర్తనని( Anasuya Husband ) ఫీలై కామెంట్లలో బండ బూతులు తిట్టారని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.

అనసూయకు సరైన టేస్ట్ లేదని ఇతనిని ఎలా పెళ్లి చేసుకుందని కొంతమంది కామెంట్లు చేశారని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత వాళ్లకు నేను క్లారిటీ ఇచ్చానని సాయి రాజేష్ తెలిపారు.అయితే ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ ఈ కామెంట్స్ తన దృష్టికి రాలేదని వెల్లడించారు.సాయి రాజేష్ అందరి మంచి కోరుకునే వ్యక్తి అని అనసూయ వెల్లడించడం గమనార్హం.

రాకింగ్ రాకేశ్( Rocking Rakesh ) కేసీఆర్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.రాకింగ్ రాకేశ్ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.రాకింగ్ రాకేశ్ ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.రాకింగ్ రాకేశ్ ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమా కోసం రాకేశ్ ఎంతో కష్టపడ్డారని గతంలో పలు వార్తలు వైరల్ అయ్యాయి.