రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ వద్ద హై లెవెల్ బ్రిడ్జి భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం 6 కోట్ల 96 లక్షల నిధులను మంజూరు చేసి కలెక్టర్ ఖాతాలో జమ చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.2015 లో ప్రారంభమైన వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు భూసేకరణ నిధులు కేటాయించకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లగా భూసేకరణ నిమిత్తం 6 కోట్ల 96 లక్షల నిధులు మంజూరు జిల్లా కలెక్టర్ పిడి ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు.ఈ హై లెవెల్ బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.







